Share News

Meta: మెటా మార్క్ జుకర్‌బర్గ్‌ చైనాతో ఒప్పందం..అమెరికాను మోసం చేశాడా..

ABN , Publish Date - Apr 12 , 2025 | 10:58 AM

​మెటా (Meta)సంస్థ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్ సారా విన్-విలియమ్స్ ఇటీవల చైనాకు సంబంధించి తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా కాంగ్రెస్‎లో మాట్లాడిన క్రమంలో మెటా సంస్థ చైనాతో వ్యాపార సంబంధాలను ఏర్పరచుకోవడంలో అమెరికా జాతీయ భద్రతను పరిగణనలోకి తీసుకోలేదని ఆమె ఆరోపించారు.

Meta: మెటా మార్క్ జుకర్‌బర్గ్‌ చైనాతో ఒప్పందం..అమెరికాను మోసం చేశాడా..
meta Ties China

అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న వేళ, మెటా(Meta) (ఫేస్‌బుక్) విషయంలో సంచలన ఆరోపణ వెలుగులోకి వచ్చింది. మెటా మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్ సారా విన్-విలియమ్స్ ఇటీవల అమెరికా కాంగ్రెస్‌లో కీలక ఆరోపణలు చేశారు. మెటా సంస్థ చైనాతో లాభదాయకమైన వ్యాపార సంబంధాలను ఏర్పరచుకునేందుకు అమెరికా జాతీయ భద్రతను పక్కన పెట్టిందని ఆమె ఆరోపించారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి అమెరికన్ వినియోగదారుల డేటాను యాక్సెస్ చేయడానికి అనుమతించే విధంగా మెటా నిర్ణయాలు తీసుకుందని ఆమె అన్నారు.


పెద్ద డీల్

దీంతోపాటు మెటా బీజింగ్‌తో కలిసి ఆన్‌లైన్ కంటెంట్‌ను నియంత్రించడానికి సహాయపడే సెన్సార్‌షిప్ నియమాలను కూడా రూపొందించిందన్నారు. అంతేకాదు మార్క్ జుకర్‌బర్గ్ గొప్ప వ్యూహకర్త అని.. అమెరికన్ జెండాను చేతిలో పట్టుకుని, దేశభక్తుడిగా కనిపిస్తూ పెద్ద డీల్ కుదుర్చుకున్నారని ఆమె పేర్కొన్నారు. గత దశాబ్దంలో చైనాతో $18 బిలియన్ల వ్యాపారాన్ని జుకర్ బర్గ్ కుదుర్చుకున్నట్లు చెప్పారు. దేశభక్తి ముసుగులో వ్యాపారం పెంచుకున్నారని విలియమ్స్ అన్నారు. సారా విన్-విలియమ్స్, మెటా సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన తరువాత, ఇటీవల అమెరికా కాంగ్రెస్‌లో ఆమె ఈ ఆరోపణలు చేశారు.


ఈ వివాదం వెనుక

ఈ ఆరోపణలకు మెటా సంస్థ ప్రతి స్పందించింది. మెటా ప్రతినిధి ర్యాన్ డేనియల్స్ మాట్లాడుతూ, సారా విన్-విలియమ్స్ వ్యాఖ్యలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఆమె వాదనల్లో నిజం లేదన్నారు. అలాగే, చైనాలో తమ సేవలను ప్రస్తుతం నిర్వహించట్లేదని స్పష్టం చేశారు. అయితే ఈ వివాదం వెనుక ఉన్న అసలైన ఉద్దేశం ఏంటనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఒప్పందం నిజంగా ఉల్లంఘించారా? లేక ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకుంటున్నారా? విన్నీ వాదనలు, మెటా సమాధానాల మధ్య ఈ వివాదం ఇంకా ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఆమె పూర్వపు అనుభవం ఈ ఆరోపణలకు బలాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.


ఇవి కూడా చదవండి:

Plane Crash: న్యూయార్క్ తర్వాత మరో విమాన ప్రమాదం..ముగ్గురు మృతి, ఒకరికి గాయాలు


SVPNPA Job Openings: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డ్రీమ్ జాబ్స్..మీకు అర్హత ఉందా, అప్లై చేశారా


Stock Market Rally: లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు..సెన్సెక్స్ 1,140 పాయింట్లు జంప్

EPFO: పీఎఫ్ ఉద్యోగులకు అలర్ట్..మరింత ఈజీగా UAN నంబర్ పొందే ఛాన్స్..

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 12 , 2025 | 11:02 AM