Monthly Income: 50 ఏళ్ల తర్వాత నెలకు రూ.లక్ష కావాలంటే ఎంత సేవ్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలి
ABN , Publish Date - Apr 14 , 2025 | 06:47 PM
ఉద్యోగం, వ్యాపారం, రిటైర్‌మెంట్ ఇవన్నీ మన జీవితంలో భాగమే. కానీ, రిటైర్‌మెంట్ తరువాత జీవితం ఎలా ఉండాలో ఇప్పటినుంచే ప్లాన్ చేసుకోకపోతే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుంది. అయితే 50 ఏళ్ల తర్వాత మీకు నెలకు లక్షా 50 వేల రూపాయలు కావాలంటే ఏం చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ప్రస్తుతం అనేక మంది ఉద్యోగులు కూడా వారి రిటైర్ మెంట్ గురించి సరిగా ప్లాన్ చేసుకోవడం లేదు. రిటైర్‌మెంట్ అంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాతే అనే అపోహ చాలామందిలో ఉంది. కానీ, మీరు 60 కాకుండా 50 ఏళ్లకే పని నుంచి తప్పుకొని, సంతోషంగా, ఆర్థిక భద్రతతో జీవించాలనుకుంటే. ఇది కూడా అసాధ్యమేమీ కాదు. కాస్త ముందుగా ఆలోచించి సరైన ప్లాన్ చేసుకుంటే ఆచరణ సాధ్యమే. ఈ క్రమంలో మీ లైఫ్‌స్టైల్‌కు తగినట్లుగా సేవింగ్స్ ప్లాన్ చేసుకోవాలి. ఇప్పటి నుంచే మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఏదైనా సేవింగ్ ప్లాన్ లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు చేస్తే దీర్ఘకాలంలో భారీ మొత్తాలను పొందవచ్చు. అయితే దీని కోసం ఏం చేయాలి. నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలనే ఇతర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి నెల ఇన్వెస్ట్
మీరు ఒకవేళ 50 ఏళ్లకు నెలకు లక్షా 50 వేల రూపాయలు తీసుకోవాలని భావిస్తే ఎంత సేవ్ చేయాలి, ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నెలవారీ SIP చేయడం మంచి ఛాయిస్. దీనిలో ప్రతి నెల ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో భారీ మొత్తాన్ని పొందవచ్చు. ఉదాహరణకు ప్రస్తుతం మీ వయస్సు 25 ఏళ్లు ఉంటే నెలకు రూ.7500 సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయాలి. ఆ క్రమంలో మీరు 25 ఏళ్ల పాటు అంటే 300 నెలల పాటు ఈ మొత్తాన్ని పెట్టుబడి చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో మీరు చేసే మొత్తం పెట్టుబడి రూ.22,50,000 కాగా, మీకు 25 ఏళ్ల తర్వాత వచ్చే మొత్తం రూ. 2,06,74,206 అవుతుంది.
2 కోట్ల రూపాయలకుపైగా
ఈ క్రమంలో మీరు చేసిన పెట్టుబడి కేవలం రూ.22 లక్షలు కాగా, మీకు వచ్చేది మాత్రం 2 కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక్కడ మీకు వడ్డీ రూపంలోనే రూ. 1,84,24,206 లభిస్తాయి. ఇటీవల కాలంలో సిప్ విధానంలో వార్షిక రాబడులు 12 నుంచి 21 మధ్య ఉంటున్నాయి. కొన్ని ఫండ్స్ ఏడాదికి 30 శాతానికి పైగా రాబడులను అందిస్తున్నాయి. కానీ ఇక్కడ వార్షిక రాబడి 15 శాతం చొప్పున లెక్కించడం జరిగింది.
నెలకు లక్షా 50 వేల రూపాయలు
అయితే మీకు 50 ఏళ్ల తర్వాత వచ్చిన రెండు కోట్ల రూపాయలను FD లేదా నెలకు సురక్షిత వడ్డీని అందించే ప్రభుత్వ స్కీంలలో ఫిక్స్ చేస్తే, అప్పటి వడ్డీ రేటు (9 శాతం అంచనా) ప్రకారం చూస్తే మీకు ఏడాదికి 18 లక్షల రూపాయలు వడ్డీ రూపంలోనే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక నెల ప్రకారం చూస్తే మీకు లక్షా 50 వేల రూపాయలు లభిస్తాయి. ఇది ఆశ్చర్యంగా అనిపించినా, సరైన ప్రణాళిక, క్రమశిక్షణతో ఇది సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఈ ప్రయాణాన్ని మీరు వెంటనే ప్రారంభిస్తే దీర్ఘకాలంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు. మీ భవిష్యత్‌ను నిర్మించుకోవడానికి ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తే రిటైర్మెంట్ సమయంలో ఎవరిపై ఆధారపడకుండా జీవించవచ్చు.
గమనిక: ఆంధ్రజ్యోతి పెట్టుబడులు చేయాలని సలహా, సూచనలు ఇవ్వదు. సమాచారం మాత్రమే అందిస్తుంది. మీకు పెట్టుబడులు చేయాలని ఆసక్తి ఉంటే నిపుణుల సలహా, సూచనలు తీసుకోవడం ఉత్తమం.
ఇవి కూడా చదవండి:
Forex vs Credit Card: జీరో ఫారెక్స్ కార్డ్ vs క్రెడిట్ కార్డ్..వీటిలో ఏది బెస్ట్ ఛాయిస్
SVPNPA Job Openings: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డ్రీమ్ జాబ్స్..మీకు అర్హత ఉందా, అప్లై చేశారా
Read More Business News and Latest Telugu News