Credit Score: క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే ఏమౌతుంది.. రికవరీకి ఎంత టైం పడుతుంది
ABN , Publish Date - Mar 31 , 2025 | 05:26 PM
Credit Score Recovery: క్రెడిట్ కార్డు ఉంది కదా అని కొంతమంది ఇష్టం వచ్చినట్లు వాడేస్తుంటారు. తీసుకున్నంత ఈజీగా డబ్బులు తిరిగి కట్టలేకపోతే.. భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది. క్రెడిట్ కార్డు బాగా దెబ్బ తింటుంది. అయితే, తగ్గిపోయిన క్రెడిట్ స్కోర్ రికవరీ చేయటం సాధ్యమా..

గత కొన్నేళ్లుగా క్రెడిట్ కార్డుల వాడకం గణనీయంగా పెరిగింది. క్రెడిట్ కార్డు పొందాలంటే.. ఒకప్పుడు ఉన్నంత ఆంక్షలు ఇప్పుడు లేవు. ఎవరికి పడితే వారికి క్రెడిట్ కార్డు వస్తోంది. అయితే, క్రెడిట్ కార్డు తీసుకున్నంత ఈజీకాదు దాన్ని సరిగ్గా వాడుకోవటం. క్రెడిట్ కార్డుల మీద వచ్చే లోన్ ఆఫర్ల కారణంగా మన జీవితమే తల్లకిందులు అయిపోవచ్చు. చాలా మంది అప్పు ఈజీగా దొరుకుతోంది కదా అని తీసేసుకుంటారు. తర్వాత ఈఎమ్ఐ కట్టడానికి ఇబ్బందిపడుతూ ఉంటారు. క్రెడిట్ కార్డు బిల్లులు కావచ్చు.. తీసుకున్న లోన్ల ఈఎమ్ఐ కావచ్చు. ఆలస్యం చేయటం లేదా ఓ నెల కట్టకుండా మరో నెల కట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల క్రెడిట్ స్కోరు బాగా దెబ్బతింటుంది.
లేట్ పెమెంట్స్ వల్ల నష్టం ఏంటి?
ఎక్స్‌పీరియన్ ఇండియా కంట్రీ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ జైన్ మాట్లాడుతూ.. ‘ మనం సమయానికి క్రెడిట్ కార్డు బిల్లులు కట్టడం మీదే మన క్రెడిట్ స్కోర్ ఆధారపడి ఉంటుంది. ఆలస్యంగా కట్టినా.. ఓ నెల కట్టకపోయినా బ్యాంకులు సదరు వ్యక్తులపై ఓ అవగాహనకు వస్తాయి. ఆర్థికంగా సరిగా లేరని, తీసుకున్న అప్పులు సమయానికి చెల్లించటం లేదన్న కారణంతో భవిష్యత్తులో కొత్త అప్పులు ఇవ్వరు. అంతేకాదు.. మనకు ఏవైనా ఆఫర్లు ఉంటే వాటిని కూడా రద్దు చేస్తారు’ అని అన్నారు.
క్రెడిట్ స్కోర్ రికవరీ సాధ్యమా?
దీని గురించి కూడా జైన్ మాట్లాడారు.. ’దారుణంగా పడిపోయిన క్రెడిట్ స్కోర్‌ను కూడా రికవరీ చేయడానికి అవకాశం ఉంది. దానికి ఆర్థిక క్రమశిక్షణ ఎంతో అవసరం. క్రమం తప్పకుండా మిగిలిన అమౌంట్ కట్టేయాలి. క్రెడిట్ స్కోర్ రికవరీ సమయం విషయంలో వ్యక్తికి వ్యక్తికి మధ్య తేడా ఉంటుంది. పేమెంట్లు చెల్లించే విషయంలో ఎంత దారుణంగా వ్యవహరించాడన్న దానిపై తీవ్రత ఆధారపడి ఉంటుంది. తరచుగా క్రెడిట్ కార్డు వాడటం.. సమయానికి బిల్లులు కట్టడం వంటివి చేస్తే త్వరగా స్కోరు పెరుగుతుంది. అలాగని ప్రతీ చిన్న దానికి క్రెడిట్ కార్డు వాడితే కూడా ఇబ్బందులు వస్తాయి. క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది’ అని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
భార్య, ఆమె ప్రియుడి దారుణం.. భర్తను కారుతో గుద్దించి..
ఇదేం ఖర్మరా బాబు.. లవ్ ఫెయిల్ అయితే.. మేకను పెళ్లి చేసుకుంటావా..