Share News

PURE EV Cashback Offers: ప్యూర్ ఈవీ వినియోగదారులకు బంపర్ ఆఫర్

ABN , Publish Date - Feb 27 , 2025 | 04:21 PM

PURE EV Cashback Offers: ప్యూర్ ఈవీ సంస్థ.. తమ కస్టమర్ల కోసం గొప్ప ఆఫర్‌‌ను పండగ వేళ తీసుకు వచ్చింది. అందులోభాగంగా.. ‘ప్యూర్ పర్ఫెక్ట్ 10’ అనే రిఫరల్ ప్రోగ్రాంను ఆ సంస్థ ప్రవేశపెట్టింది. ఆ క్రమంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్లును ఆ సంస్థ ప్రకటించింది.

PURE EV Cashback Offers: ప్యూర్ ఈవీ వినియోగదారులకు బంపర్ ఆఫర్
PURE EV

PURE EV Cashback Offers: దేశ రాజధాని న్యూఢిల్లీ.. కాలుష్యపు కోరల్లో చిక్కుకొంది. ఇదే పరిస్థితి మిగతా మహానగరాలకు వర్తిస్తే.. పరిస్థితి దారుణంగా మారుతోంది. అలాంటి వేళ.. ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించే విధంగా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. దీంతో పలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు ఏర్పాటయ్యాయి. వాటిలో దిగ్గజ సంస్థ ప్యూర్ ఈవీ ( PURE EV). సదరు సంస్థ.. తమ కస్టమర్ల కోసం గొప్ప ఆఫర్‌‌ను తీసుకు వచ్చింది. అదీకాక వరుస పండగలు శివరాత్రి, హోలీ, ఉగాది, రంజాన్ పండగలు కూడా రావడంతో.. ఆ సంస్థ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. అందులోభాగంగా.. ‘ప్యూర్ పర్ఫెక్ట్ 10’ అనే రిఫరల్ ప్రోగ్రాంను ఆ సంస్థ ఆవిష్కరించింది. ఇందులో వినియోగదారులను ఆకట్టుకునే క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉన్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

మార్చి 31 వరకు ఈ ఆఫర్‌..

2025, మార్చి 31వ తేదీలోగా ప్యూర్ ఈవీ వాహనాలను కొనుగోలు చేసే కొత్త కస్టమర్లకు ‘ప్యూర్ పర్ఫెక్ట్ 10’ అనే రిఫరల్ ప్రోగ్రాం వర్తించనుందని తెలిపింది. అలాగే ఆయా అవుట్ లెట్స్‌లో స్టాక్స్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించింది. ఈ పథకం కింద ప్యూర్ ఈవీ స్కూటర్‌ను కొనుగోలు చేసేలా తమ స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్‌ను రిఫర్ చేసే కస్టమర్లు రూ. 40 వేల క్యాష్ బ్యాక్ రివార్డులు పొంద వచ్చని పేర్కొంది.


రూ.4 వేల క్యాష్‌బ్యాక్‌ ఓచర్లు:

ప్రస్తుత, కొత్త ప్యూర్ ఈవీ వినియోగదారులకు వారి రిజిస్టర్డ్ వాట్సాప్ నంబరుపై 10 రిఫరల్ కోడ్‌లు వస్తాయి. రిఫర్ చేసిన వారు ప్యూర్ ఈవీని కొనుగోలు చేస్తే అలాంటి ప్రతి లావాదేవీకిగాను రిఫరర్‌కి రూ.4,000 క్యాష్‌బ్యాక్ ఓచర్‌లు లభించనున్నాయి. అయితే ఒక్కో రిఫరర్ గరిష్టంగా పది మంది వరకు కొత్త కొనుగోలుదార్లకు ఇది వర్తిస్తుంది.


ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు..

పర్యావరణహిత మొబిలిటీ లక్ష్య సాధనకు దోహదపడుతూనే రిఫరల్స్ ఇవ్వడం ద్వారా ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్ ఇన్సెంటివ్‌లతో ప్రయోజనం కూడా పొందవచ్చని ప్యూర్‌ సహా వ్యవస్థాపకుడు, సీఈవో రోహిత్‌ వదేరా తెలిపారు. ఇది దేశవ్యాప్తంగా ఈవీల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించగలదని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు.

For Business News And Telugu News

Updated Date - Feb 27 , 2025 | 04:24 PM