Stock Market: దేశీయ సూచీలకు భారీ లాభాలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Mar 18 , 2025 | 03:55 PM
భారత వాణిజ్య లోటు మూడేళ్ల కనిష్టానికి చేరడం, వరుస నష్టాల నేపథ్యంలో చాలా స్టాక్స్ ఆకర్షణీయంగా మారడంతో మదుపర్లు మళ్లీ కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. సోమవారం లాభాలు అందుకున్న దేశీయ సూచీలు మంగళవారం కూడా అదే జోరును చూపించాయి.

భారత వాణిజ్య లోటు మూడేళ్ల కనిష్టానికి చేరడం, వరుస నష్టాల నేపథ్యంలో చాలా స్టాక్స్ ఆకర్షణీయంగా మారడంతో మదుపర్లు మళ్లీ కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. సోమవారం లాభాలు అందుకున్న దేశీయ సూచీలు మంగళవారం కూడా అదే జోరును చూపించాయి. చైనా తీసుకుంటున్న ఉద్దీపన చర్యలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరచడంతో ఆసియా మార్కెట్లు భారీ లాభాలను ఆర్జించాయి. అదే బాటలో సెన్సెక్స్, నిఫ్టీ కూడా కదలాడాయి (Business News).
సోమవారం ముగింపు (74, 169)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 500 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. మధ్యాహ్నం తర్వాత ఆ లాభాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా మెటల్, ఐటీ, ఫైనాన్స్ స్టాక్స్ భారీ లాభాలను ఆర్జించాయి. దీంతో సెన్సెక్స్ చాలా రోజుల తర్వాత 75 వేలను దాటింది. చివరకు సెన్సెక్స్ 1,131 పాయింట్ల లాభంతో 75, 301 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 3251 పాయింట్ల లాభంతో 22, 834 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్‌లో పేటీఎమ్, పీబీ ఫిన్‌టెక్, జొమాటో, ఐఐఎఫ్‌ఎల్ షేర్లు లాభాలను ఆర్జించాయి. ఛంబల్ ఫెర్టిలైజర్స్, బజాజ్ ఫిన్‌సెర్వ్, భారతీ ఎయిర్‌టెల్, పిడిలైట్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1055 పాయింట్లు ఎగబాకింది. బ్యాంక్ నిఫ్టీ 960 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 86.57 గా ఉంది.
ఇవి కూడా చదవండి:
Recharge Offer: రూ.199 ప్లాన్ అదుర్స్.. డైలీ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..