Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..
ABN , Publish Date - Mar 23 , 2025 | 03:30 PM
మీరు ఆరోగ్య బీమా తీసుకోవాలని చూస్తున్నారా. అయితే ఈ విషయాలు మాత్రం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు గ్రామాల్లో నివసిస్తూ ఎక్కువ ప్రీమియం చెల్లిస్తే మాత్రం నష్టపోవాల్సి ఉంటుంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Health Insurance Premium: ప్రస్తుత కాలంలో ఆరోగ్య బీమా ప్రీమియం విలువలో అనూహ్య పెరుగుదల నమోదైంది. ఈ కారణంగా చాలా మంది తమ నగరవాసులు ప్రస్తుత పాలసీలను రద్దు చేసుకోవడానికి లేదా ఇతర బీమా సంస్థలకు మారడానికి ప్రయత్నస్తున్నారు. అయితే, ఈ పెరిగిన ప్రీమియం మొత్తం మీరు నివసించే నగరంపై కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంటే, మీరు మెట్రో నగరంలో నివసిస్తే, చిన్న పట్టణంలో ఉన్నవారి కంటే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది.
ఖర్చులను బట్టి
అవును మీరు విన్నది నిజమే. మీ ఆరోగ్య బీమా ప్రీమియంను నిర్ణయించే సమయంలో మీ వయస్సు, ఆరోగ్య పరిస్థితి లేదా భీమా పాలసీకి సంబంధించి మాత్రమే కాకుండా, మీ నివాస ప్రాంతం కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. భీమా సంస్థలు భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సంరక్షణ ఖర్చుల అంచనాలు, క్లెయిమ్‌లు, వైద్య సేవల ఖర్చులను బట్టి ఈ ప్రీమియం మొత్తాన్ని నిర్ణయిస్తాయని అంటున్నారు. వీటిలో ఒక ముఖ్యమైన అంశం నివాస ప్రాంతం. నిపుణుల ప్రకారం, నగరం ఒక ప్రధాన అంశంగా ఉంటుంది.
జోన్‌ల వర్గీకరణ
భారతదేశంలో బీమా సంస్థలు అన్ని నగరాలను వేర్వేరు జోన్‌లుగా వర్గీకరిస్తాయి. ఈ జోన్‌ల వర్గీకరణ ఆధారంగా ఆరోగ్య బీమా ప్రీమియంను నిర్ణయిస్తారు. దీని ప్రకారం చూస్తే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో నివసించే వ్యక్తి, పల్లెటూరులో లేదా చిన్న పట్టణంలో ఉన్న వ్యక్తికంటే చాలా ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది.
భీమా సంస్థలు మూడు ప్రధాన జోన్‌లలో నగరాలను వర్గీకరణ
జోన్ A (అత్యధిక ప్రీమియం): ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలు
జోన్ B: టైర్ 1, టైర్ 2 నగరాలు
జోన్ C (అత్యల్ప ప్రీమియం): టైర్-3 నగరాలు, గ్రామీణ ప్రాంతాలు
మెట్రో నగరాల్లో ఆరోగ్య ఖర్చులు ఎక్కువ
ఈ జోన్‌ల వర్గీకరణ ప్రకారం చూస్తే ఆరోగ్య బీమా ప్రీమియంను ప్రభావితం చేసే ప్రధాన కారణం ఏమిటంటే, మెట్రో నగరాల్లో వైద్య సేవలు ఖరీదైనవి, అలాగే క్లెయిమ్‌ల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మెట్రో నగరంలో నివసిస్తున్నప్పుడు, వైద్య సేవలకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ముఖ్యంగా ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్స్ సహా ఇతర ఆరోగ్య సేవల కారణంగా ఇవి పెరుగుతాయి. అలాగే, మెట్రో నగరాల్లో ప్రజలందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ, అవి ఎక్కువ ఖర్చు కారణంగా, ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను ఎక్కువ చేస్తాయి. అందుకే మెట్రో నగరాల్లో ప్రీమియం ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
ప్రీమియంను పెంచే అవకాశాలు
మెట్రో నగరాల్లో ఎక్కువ మంది ప్రజలు ఆరోగ్య సమస్యలతో బాధపడతారు. తద్వారా బీమా సంస్థలకు అదనపు రిస్క్ ఉంటుంది. ఈ రిస్క్‌ను పరిగణనలోకి తీసుకుంటూ, బీమా సంస్థలు అండర్‌రైటింగ్ కింద బీమా ప్రీమియంను పెంచే అవకాశాలు ఉంటాయి. అండర్‌రైటింగ్ అనేది, ఏదైనా పాలసీకి సంబంధించిన ప్రమాదాలను అంచనా వేసే ప్రక్రియ. ఈ క్రమంలో పెద్ద నగరాలలో దీనికి ఎక్కువ ఖరీదవుతుంది, కాబట్టి ప్రీమియం కూడా ఎక్కువవుతుంది.
ఇవి కూడా చదవండి:
Recharge Offer: క్రేజీ ఆఫర్..రూ.5కే డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Read More Business News and Latest Telugu News