IRCTC: తిరుపతికి చౌక టూర్ ప్యాకేజీ..పిల్లలతో సహా ఇలా ఈజీగా దర్శించుకోండి
ABN , Publish Date - Apr 01 , 2025 | 07:24 PM
ఎండాకాలం వచ్చింది. దీంతో స్కూల్ పిల్లలకు సెలవులు ఉంటాయి కాబట్టి, అనేక మంది హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళేందుకు ప్లాన్ చేస్తుంటారు. ఇలాంటి వారి కోసం IRCTC బడ్జెట్ ధరల్లో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

సమ్మర్ టైం రానే వచ్చేసింది. ఇదే సమయంలో టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఎగ్జామ్స్ కూడా పూర్తయ్యాయి. ఈ క్రమంలో అనేక మంది హైదరాబాద్ నుంచి తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు. అయితే బస్సులకు ఫుల్ డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఫ్యామిలీతో వెళ్లే వారికి ట్రైన్స్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇలాంటి వారి కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) ప్రత్యేక టూర్ ప్యాకేజీని అమలు చేస్తుంది. దీని ద్వారా మీరు తిరుపతి మాత్రమే కాకుండా శ్రీకాళహస్తిని కూడా సందర్శించుకోవచ్చు.
ట్రైన్ సేవలు
ఈ టూరిజం ప్యాకేజీలో మీరు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ద్వారా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణంలో మీరు తిరుపతికి చేరుకున్న తర్వాత, క్యాబ్, బస్ సేవలను పొందుతారు. హోటల్, భోజనం వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. ఇది మీకు తిరుపతిలో ఈజీగా భస చేసేందుకు సౌకర్యాలను అందిస్తుంది. కస్టమర్లకు అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం కూడా అందజేస్తారు. దీనికోసం అదనంగా ఎలాంటి డబ్బు వసూలు చేయదు.
దీంతో పాటు, అనేక వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తారు. టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న ప్రయాణీకులందరికీ బస చేయడానికి డీలక్స్ గది సౌకర్యం కల్పించబడుతుంది. ఈ టూర్ నాలుగు రోజులు, మూడు రాత్రుల పాటు కొనసాగుతుంది. ట్రైన్ రైడ్ సమయంలో భోజనాలు సరఫరా చేయబడతాయి. ఈ ప్యాకేజీతో మీరు ట్రిప్ డ్యూరింగ్ ఇన్సూరెన్స్ కూడా పొందుతారు.
టూర్ ప్యాకేజీ ధర
IRCTC ద్వారా (https://www.irctctourism.com/tourpackageBooking?packageCode=SHR071A) ఈ టూర్ ప్యాకేజీలో సింగిల్ ఆక్యుపెన్సీ టికెట్ ధర (SL) రూ. 12,030. డబుల్ ఆక్యుపెన్సీ టికెట్ ధర రూ. 89400, ట్రిపుల్ ఆక్యుపెన్సీ టికెట్ ధర రూ. 7170. అయితే, మీరు పిల్లలతో ప్రయాణిస్తే, మీరు వారికి కూడా టిక్కెట్లు కొనుగోలు చేయాలి. ఈ టూర్ ప్యాకేజీలో ఐదేళ్లలోపు పిల్లలకు ఎలాంటి టికెట్ ఉండదు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ద్వారా మీరు వివిధ రకాల క్లాసులలో ప్రయాణించవచ్చు. ఈ ప్యాకేజీలో అనేక సౌకర్యాలు ఉన్నందున, మీరు ఈ ప్యాకేజీ ఎంచుకుంటే ఈజీగా ఈ యాత్రను పూర్తి చేసుకోవచ్చు.
ఎప్పుడు స్టార్ట్..
ఈ ప్యాకేజీలో భాగంగా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (12797) ద్వారా ప్రయాణించేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ (కాచిగూడ) నుంచి తిరుపతి (తిరుపతి) చేరుకోవడానికి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (12797) ఒక ప్రధానమైన ట్రైన్. ఈ ప్రయాణం సమయం సుమారు 12 గంటల 50 నిమిషాలుగా ఉంటుంది. ఇది కాచిగూడ స్టేషన్ నుంచి బయలుదేరి, తిరుపతి వచ్చే రోజు ఉదయం 7:05 గంటలకు చేరుకుంటుంది.
ఇవి కూడా చదవండి:
Donald Trump: భారత ఉత్పత్తులకు అమెరికాలో వాత..చుక్క, ముక్కపై ట్రంప్ ఫోకస్..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..
Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..
Read More Business News and Latest Telugu News