Share News

సైకిల్‌పై సరదాగా..

ABN , Publish Date - Mar 17 , 2025 | 12:56 AM

అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్లు కె.విజయకృష్ణన్‌, ఎస్‌.దినేశ్‌కుమార్‌లు ఆదివారం సైకిల్‌ తొక్కి సందడి చేశారు. అనకాపల్లి యోగా లైఫ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో తుమ్మపాల చినబాబుకాలనీ నుంచి అనకాపల్లి పట్టణం మీదుగా బొజ్జన్నకొండ వరకు ఐదు కిలోమీటర్ల మేర జరిగిన సైకిల్‌ ర్యాలీలో వారు పాల్గొని అందర్నీ ఉత్సాహపరిచారు.

సైకిల్‌పై సరదాగా..
సైకిల్‌ ర్యాలీలో పాల్గొన్న అల్లూరి, అనకాపల్లి జిల్లా కలెక్టర్లు

- విధుల్లో నిత్యం బిజీగా ఉండే అల్లూరి, అనకాపల్లి జిల్లా కలెక్టర్లు సైకిల్‌ తొక్కి సందడి

- ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని సూచన

అనకాపల్లి టౌన్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్లు కె.విజయకృష్ణన్‌, ఎస్‌.దినేశ్‌కుమార్‌లు ఆదివారం సైకిల్‌ తొక్కి సందడి చేశారు. అనకాపల్లి యోగా లైఫ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో తుమ్మపాల చినబాబుకాలనీ నుంచి అనకాపల్లి పట్టణం మీదుగా బొజ్జన్నకొండ వరకు ఐదు కిలోమీటర్ల మేర జరిగిన సైకిల్‌ ర్యాలీలో వారు పాల్గొని అందర్నీ ఉత్సాహపరిచారు. అనంతరం వారు మెట్ల మార్గంలో బొజ్జన్నకొండ ఎక్కారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచించారు. నిత్యం విధుల్లో బిజీగా ఉండే అల్లూరి, అనకాపల్లి జిల్లా కలెక్టర్లు దినేశ్‌కుమార్‌, విజయకృష్ణన్‌లు దంపతులు కావడం, ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో యోగా లైఫ్‌ సెంటర్‌ ఫౌండర్‌ కరణం బాబూరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 17 , 2025 | 12:56 AM