Share News

ఠారెత్తిస్తున్న ఎండలు

ABN , Publish Date - Mar 17 , 2025 | 12:59 AM

మన్యంలో ఎండలు తీవ్ర ప్రభావం చూపుతుండడంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పొగమంచు, చలి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. పాడేరులో ఆదివారం 40.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, జీకేవీధిలో 34.0, జి.మాడుగుల, హుకుంపేటలో 34,7, చింతపల్లిలో 35.1, అరకులోయలో 35.2, పెదబయలులో 34.9, డుంబ్రిగుడలో 37.3, ముంచంగిపుట్టులో 36.4, అనంతగిరిలో 33.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేసవి ప్రారంభంలోనే ఎండలు తీవ్ర ప్రభావం చూపడంతో రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని జనం ఆందోళన చెందుతున్నారు.

ఠారెత్తిస్తున్న ఎండలు
ఎండ ప్రభావానికి జనం అంతంతమాత్రంగా ఉన్న పాడేరు అంబేడ్కర్‌ సెంటర్‌

పాడేరులో 40.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

- మంచు, చలి ప్రభావం తగ్గుముఖం

పాడేరు, మార్చి 16(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఎండలు తీవ్ర ప్రభావం చూపుతుండడంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పొగమంచు, చలి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. పాడేరులో ఆదివారం 40.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, జీకేవీధిలో 34.0, జి.మాడుగుల, హుకుంపేటలో 34,7, చింతపల్లిలో 35.1, అరకులోయలో 35.2, పెదబయలులో 34.9, డుంబ్రిగుడలో 37.3, ముంచంగిపుట్టులో 36.4, అనంతగిరిలో 33.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేసవి ప్రారంభంలోనే ఎండలు తీవ్ర ప్రభావం చూపడంతో రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని జనం ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Mar 17 , 2025 | 12:59 AM