Share News

Hyderabad: దారుణం.. ఇటుకలతో మోది బాలుడి హత్య

ABN , Publish Date - Apr 04 , 2025 | 07:17 AM

నగరంలోని మీరాలం చెరువు పక్కన ఓ బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితులతో కలసి ఇంటినుంచి బయటకు వెళ్లిన ఆ బాలుడు మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. ఆ బాలుడ్ని మరో ముగ్గురు స్నేహితులు అతడ్ని చంపేశారని తేలించి. పోలీసులు ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: దారుణం.. ఇటుకలతో మోది బాలుడి హత్య

- మీరాలం చెరువు సమీపంలో ఘటన

హైదరాబాద్: రాజేంద్రనగర్‌ సర్కిల్‌(Rajendranagar Circle) పరిధిలోని మీరాలం చెరువు పక్కన ఓ బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన గురువారం ఉదయం 7:30 గంటలకు వెలుగు చూసింది. సులేమాన్‌నగర్‌ డివిజన్‌ మహమూద్‌నగర్‌ ప్రాంతానికి చెందిన రఫీక్‌ బ్యాండ్‌ వాయిద్యకారుడు. అతని కుమారుడు సింప్లాన్‌(15) రాత్రి 10 గంటల ప్రాంతంలో స్నేహితులతో కలసి ఇంటినుంచి బయటకు వెళ్లాడు.

ఈ వార్తను కూడా చదవండి: Secunderabad Railway: 10 రైళ్లకు టెర్మినళ్ల మార్పు


ఉదయం మహమూద్‌నగర్‌ను ఆనుకుని ఉన్న మీరాలం చెరువు సమీపంలో సింప్లాన్‌ మృతదేహం పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు అత్తాపూర్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడిని మహమూద్‌నగర్‌కు చెందిన రఫీక్‌ కుమారుడిగా పోలీసులు గుర్తించారు. విచారించగా స్నేహితులతో కలసి బయటకు వచ్చిన సింప్లాన్‌పై తెలిసిన మరో ముగ్గురు మిత్రులు దాడిచేసి హత్య చేసినట్లు తేలింది.


city2.2.jpg

సింప్లాన్‌ స్నేహితుల మధ్య మాయమాటలు చెబుతూ గొడవ పడేటట్లు చేస్తున్నాడని, దీంతో వారు ఇటుక రాళ్లతో అతని మొఖంపై మోదీ హత్య చేశారని పోలీసులు పేర్కొన్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అత్తాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రావు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

2000 ఎకరాల్లో ప్రపంచస్థాయి ఎకో పార్క్‌!

మా ఆదేశాలు పాటించకపోతే.. సీఎస్‌ జైలుకే!

అకాల వర్షంతో అతలాకుతలం

రెయిన్ అలర్ట్.. మరో రెండు గంటలపాటు..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 04 , 2025 | 07:17 AM