ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cyber ​​criminals: సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. గూగుల్‌ సెర్చ్‌ చేస్తున్న వారే టార్గెట్‌

ABN, Publish Date - Jan 16 , 2025 | 10:35 AM

ఇంటర్నెట్‌ వినియోగం లేనిదే సమయం గడవని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు తమ అవసరాల కోసం ఇంటర్నెట్‌ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ పైనే ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఇదే నేరాలకు దారి చూపిస్తోంది. సెర్చ్‌ ట్రెండ్స్‌ను ఫాలో అవుతున్న సైబర్‌ నేరగాళ్లు.. ఎవరు ఎలాంటి అంశాల కోసం వెతుకుతున్నారో గూగుల్‌ సెర్చ్‌ ట్రెండ్స్‌ తెలుసుకొని దానికి అనుగుణంగా నకిలీ వెబ్‌సైట్‌లను, అప్లికేషన్‌లను, మొబైల్‌ యాప్‌లను రూపొందిస్తున్నారు.

- నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌లు, అప్లికేషన్స్‌తో మోసాలు

సైబర్‌ నేరగాళ్లు తమ వ్యూహాలతో మరింత దూకుడు పెంచుతున్నారు. డిజిటల్‌ ప్రపంచంలో ఉన్న ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గూగుల్‌ సెర్చ్‌ ట్రెండ్‌ తెలుసుకొని నకిలీ వెబ్‌సైట్లు రూపొందించి నేరాలకు పాల్పడుతున్నారు.

హైదరాబాద్‌ సిటీ: ఇంటర్నెట్‌ వినియోగం లేనిదే సమయం గడవని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు తమ అవసరాల కోసం ఇంటర్నెట్‌ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ పైనే ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఇదే నేరాలకు దారి చూపిస్తోంది. సెర్చ్‌ ట్రెండ్స్‌ను ఫాలో అవుతున్న సైబర్‌ నేరగాళ్లు.. ఎవరు ఎలాంటి అంశాల కోసం వెతుకుతున్నారో గూగుల్‌ సెర్చ్‌ ట్రెండ్స్‌ తెలుసుకొని దానికి అనుగుణంగా నకిలీ వెబ్‌సైట్‌లను, అప్లికేషన్‌లను, మొబైల్‌ యాప్‌లను రూపొందిస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అధిక సంపాదన కోసం అడ్డదారులు.. తుపాకుల విక్రయానికి యత్నం


వాటి నిర్వహణ, అందులో కంటెంట్‌పై అనుమానం రాకుండా చూసుకుంటున్నారు. చాలామంది సెలవుల్లో బీచ్‌లు, రిసార్ట్‌లు, హోటల్స్‌కు వెళ్లి సరదాగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడపాలనుకొని ఆన్‌లైన్‌లో గూగుల్‌ సెర్చ్‌లో ఆ వివరాలను వెతుకుతారు. ఆ సమయంలో వారికి నకిలీ వెబ్‌సైట్లే ముందువరసలో కనిపించేలా చేస్తూ, అందులోంచి బుకింగ్‌లు, చెల్లింపులు జరిగేలా చేస్తూ సైబర్‌ నేరగాళ్లు దోపిడీ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనల్లో నగరానికి చెందిన వారు సైబర్‌ నేరగాళ్ల బారిన పడి డబ్బు పోగొట్టుకున్నారు.


జాగ్రత్తలు తీసుకోవాలి

ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌లో వెతికే సమాచారం నిజమో కాదో తెలుసుకోవాలంటే ఒకటికి రెండుసార్లు చూసుకొని నమ్మకం కుదిరిన తర్వాతే డబ్బులు చెల్లించాలి. సైబర్‌ మోసం బారిన పడితే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలి.


సూర్యలంక బీచ్‌ రిసార్ట్‌ పేరుతో వల..

సెలవుల్లో చాలామంది బయటకు వెళ్లి ఎంజాయ్‌ చేయాలనుకుంటారు. అలాంటి వారు ఏపీలోని సూర్యలంక బీచ్‌ రిసార్ట్‌ గురించి తెలుసుకోవడానికి గూగల్‌ సెర్చ్‌లో సూర్యలంక బీచ్‌ రిసార్ట్‌(Suryalanka Beach Resort) అని టైప్‌ చేయగా.. సైబర్‌ నేరగాళ్లు రూపొందించిన నకిలీ వెబ్‌సైట్లు కనిపించాయి. వాటిలోనే బుకింగ్‌ చేసుకొని డబ్బులు చెల్లించారు. బీచ్‌కు వెళ్లి రిసార్ట్‌లో రూమ్‌ల బుకింగ్‌ల విషయాన్ని అడిగితే మోసం బయటపడింది. దీనిపై ఫిర్యాదు చేయడానికి చాలామంది ముందుకు రావడంలేదు. రెండు మూడు రోజుల్లో మూడు కేసులు పోలీసుల దృష్టికి వచ్చాయి. ఇలాంటివి చాలా ఉండే అవకాశం ఉంది. నగర వాసులు రిసార్ట్‌లలో గదులు బుక్‌ చేసుకునేటప్పుడు, రాయితీలు, ఆన్‌లైన్‌ ఆఫర్లపట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: యువతిని రక్షించబోయి హత్యకు గురయ్యాడా?!

ఈవార్తను కూడా చదవండి: KTR: అరెస్టు చేస్తారా?

ఈవార్తను కూడా చదవండి: పుప్పాలగూడలో జంట హత్యల కలకలం

ఈవార్తను కూడా చదవండి: పవర్‌ప్లాంటు స్ర్కాప్‌ కుంభకోణంపై నీలినీడలు !

Read Latest Telangana News and National News

Updated Date - Jan 16 , 2025 | 10:35 AM