Social media: సోషల్ మీడియాతో జర జాగ్రత్త.. నకిలీ ప్రొఫైల్స్‌తో వల వేస్తూ..
ABN, Publish Date - Mar 15 , 2025 | 11:42 AM
కొత్తవారు పంపిన లింక్‌లను ఓపెన్ చేయొద్దని, సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని పోలీస్ శాఖ సూచించింది. నగరంలో ఇటీవల సైబర్ నేరాలు అధికమయ్యాయి. దీంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నడుంబిగించింది.
కొత్తవారు పంపిన లింక్‌లను ఓపెన్ చేయొద్దు
వేధింపులు ఎదురైతే ఫిర్యాదు చేయండి
సూచనలు జారీ చేసిన సైబర్ క్రైం అధికారులు
హైదరాబాద్ సిటీ: సోషల్ మీడియా(Social media) వేదికలను ఉపయోగిస్తున్న యువత జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్ క్రైం(Cybercrime) అధికారులు సూచిస్తున్నారు. కొత్త ఐడీ నుంచి వచ్చిన ఫ్రెండ్ రిక్వె్‌స్టను ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయొద్దని, కొత్త వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం, ఫొటోలు వీడియోలు పంచుకోవద్దని హెచ్చరిస్తున్నారు. బలమైన పాస్‌వర్డ్‌లు, వెరిఫికేషన్‌లు పెట్టుకోవడం, నకిలీ ప్రొఫైల్స్‌కు దూరంగా ఉండటం మేలని చెబుతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఉండేది గేటెడ్ కమ్యూనిటీలో.. అమ్మేది గంజాయి..
సైబర్ నేరగాళ్లు, మోసగాళ్లు ఆన్‌లైన్‌లో వేల కొద్దీ నకిలీ ప్రొఫైల్స్ రూపొందించి ఫ్రెండ్ రిక్వె్‌స్టలు పంపుతున్నారు. కొంతమంది ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడుతుండగా, మరి కొంతమంది అసభ్యకర సందేశాలు, చిత్రాలు పంపుతూ ఇబ్బందులు పెడుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఫ్రెండ్స్ అంటూ చాటింగ్ చేసి, వివరాలు, పొటోలు సేకరిస్తున్నారు. వాటిని మార్ఫింగ్ చేసి ఆన్‌లైన్‌లో పెడతామని వేధిస్తున్నారు.
లైక్‌లు కామెంట్ల కోసం కొంతమంది చేస్తున్న పోస్ట్‌లతో సోషల్ ట్రోలింగ్ ఇరకాటంలో పడితే, మరి కొందరు తెలియకుండా వారి వలలో పడుతున్నారు. సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోలు, వివరాలతో నకిలీ ప్రొఫైల్ రూపొందించిన మోసగాళ్లు.. అసభ్య చిత్రాలు, సందేశాలు పంపి, వేధింపుల బారిన పడేలా చేస్తున్నారు. ముఖ్యంగా యువతులు ఎక్కువగా ఈ వేధింపుల బారిన పడుతున్నారు. కొంతమందికి సోషల్ మీడియా వేదికలు వేధింపులు, బెదిరింపులతో చేదు జ్ఞాపకాలను మిగుల్చుతున్నాయి.
సైబర్ క్రైం పోలీసుల సలహాలు, సూచనలు
- ప్రతీ ఫ్రెండ్ రిక్వె్‌స్టను యాక్సెప్ట్ చేయొద్దు.
- కొత్త వారు పంపిన లింక్‌లను ఓపెన్ చేయొద్దు, కొత్త యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవద్దు.
- ప్రొఫైల్, ప్రొఫైల్ పిక్‌ను తప్పనిసరిగా లాక్ చేయాలి.
- అక్షరాలు, అంకెలు, స్పెషల్ క్యారెక్టర్‌లతో పాస్‌వర్డ్ పెట్టుకోవాలి.
- ప్రతీ ఖాతాకు ప్రత్యేక పాస్‌వర్డ్ ఉండాలి.
- కొత్తవారు సందేశాలు, ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే స్పందించొద్దు.
- కొత్త మెయిల్స్ వచ్చినప్పుడు వాటి మెయిల్ డొమైన్‌లను పరిశీలించాలి.
- కొత్త, వింత ప్రొఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి.
- వేధింపులు ఎదురైతే నమ్మకస్తులు, కుటుంబ సభ్యులకు చెప్పండి, ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి:
Arjun Reddy: గ్రూప్-3 టాపర్లూ పురుషులే..
నాగారంలోని ఆ 50 ఎకరాలు భూదాన్ భూములు కావు
కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై.. తుది దశకు సాధ్యాసాధ్యాల అధ్యయనం
Read Latest Telangana News and National News
Updated Date - Mar 15 , 2025 | 11:42 AM