ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: యూపీ, బిహార్‌ నుంచి తుపాకులు..

ABN, Publish Date - Jan 16 , 2025 | 07:18 AM

నగరంలో దేశీవాళి తుపాకుల విక్రయాలు కలకలం రేపుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పొట్టకూటి కోసం వచ్చిన నేరగాళ్లు, అధిక సంపాదన కోసం దేశీవాళీ తుపాకులను తెచ్చి నగరంలో విక్రయిస్తున్నారు.

- రూ.20 వేలకు కొనుగోలు రూ.లక్షకు అమ్మకం

- నిఘా పెట్టి అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు

నగరంలో దేశీవాళి తుపాకుల విక్రయాలు కలకలం రేపుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పొట్టకూటి కోసం వచ్చిన నేరగాళ్లు, అధిక సంపాదన కోసం దేశీవాళీ తుపాకులను తెచ్చి నగరంలో విక్రయిస్తున్నారు.

హైదరాబాద్‌ సిటీ: యూపీ, బిహార్‌(UP, Bihar) సరిహద్దు జిల్లాల్లో కొందరు అక్రమార్కులు తుపాకుల తయారీ కర్మాగారాలను ఇళ్లలో నిర్వహిస్తున్నారు. తపంచా, తుపాకులు తయారు చేసి విక్రయిస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: పండగపూట విషాదం.. వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు దుర్మరణం


పాత నేరస్థులు ఆత్మరక్షణ కోసం, అక్రమార్కులు బెదిరింపుల కోసం, ఇతర అసాంఘిక కార్యక్రమాలు చేసేందుకు తుపాకులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. యూపీ, బిహార్‌లో రూ.20 వేలకు తుపాకులు కొనుగోలు చేసిన వీరు, నగరంలో డిమాండ్‌ను బట్టి రూ. లక్ష వరకు విక్రయిస్తున్నారు. అక్రమ ఆయుధాల రవాణా, విక్రయంపై నిఘా పెట్టిన రాచకొండ పోలీసులు(Rachakonda Police) నెలల వ్యవధిలో పలువురిని అరెస్ట్‌ చేసి, దేశీవాళి తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.


ఇటీవల ఘటనలు

మల్లంపేటకు చెందిన మాదాల నరేష్‌ ఓ పార్టీ నాయకుడికి అనుచరుడిగా ఉంటూ రియల్‌ దందాలు చేస్తున్నాడు. యూపీ నుంచి తుపాకీ కొనుగోలు చేసిన ఇతడు సెటిల్‌మెంట్‌ల సందర్భంగా తుపాకీతో బెదిరింపులకు పాల్పడుతున్నాడు. గాజులరామారం ప్రాంతంలో ఎల్‌ఎన్‌ బార్‌ వద్ద ఘర్షణ సందర్భంగా నరేష్‌ కారుతో గుద్దడమే కాకుండా, తుపాకీతో కాల్పులు జరిపి హంగామా చేశాడు. బోయినపల్లి ప్రాంతంలో కూరగాయల దుకాణం నిర్వహిస్తున్న యూపీకి చెందిన వ్యాపారి, పక్క దుకాణం వ్యక్తితో గొడవ జరగడంతో నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు.


అరెస్టులు..

- యూపీకి చెందిన హరేకృష్ణ యాదవ్‌, బిహార్‌ నుంచి రెండు తుపాకులు, తపంచా కొనుగోలు చేసి, రైలులో నగరానికి తరలించాడు. అమ్మే ప్రయత్నం చేస్తుండగా ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

- యూపీ నుంచి కంట్రీమేడ్‌ తుపాకీ కొనుగోలు చేసి, నగరానికి వచ్చిన కాకినాడకు చెందిన సాయిరాంరెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. దేశీయ తుపాకీతోపాటు 3 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.


- బిహార్‌కు చెందిన పాత నేరస్థుడు అరుణ్‌ యాదవ్‌ నగరానికి వచ్చి హోటల్‌ వద్ద సెక్యూరిటీ గార్డుగా కొంతకాలం పనిచేశాడు. బిహార్‌ నుంచి దేశీయ తుపాకులు తెచ్చి విక్రయించే ప్రయత్నం చేస్తుండగా రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

- నగరంలో తుపాకులు అమ్మే ప్రయత్నం చేస్తున్న యూపీకి చెందిన మిథిలేష్‌ కుమార్‌ను ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ, మీర్‌పేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి 2 తుపాకులు, 6 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.


ఈవార్తను కూడా చదవండి: యువతిని రక్షించబోయి హత్యకు గురయ్యాడా?!

ఈవార్తను కూడా చదవండి: KTR: అరెస్టు చేస్తారా?

ఈవార్తను కూడా చదవండి: పుప్పాలగూడలో జంట హత్యల కలకలం

ఈవార్తను కూడా చదవండి: పవర్‌ప్లాంటు స్ర్కాప్‌ కుంభకోణంపై నీలినీడలు !

Read Latest Telangana News and National News

Updated Date - Jan 16 , 2025 | 07:18 AM