Share News

Operation Dhoolpet: 250 రోజుల్లో 102 కేసులు

ABN , Publish Date - Apr 09 , 2025 | 07:32 AM

హైదరాబాద్ నగరంలో ధూల్‌పేట్‌ అంటేనే నాటుసారా, గంజాయి తదితర వాటిని విక్రయించే ఏరియాగా రికార్డుల్లోకెక్కింది. అయితే.. దీన్ని పూర్తిగా రూపుమాపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా నాటుసారా కేంద్రాలపై దాడులు నిర్వహిస్తోంది. 250 రోజుల్లో 102 కేసులు నమోదు చేశారు.

Operation Dhoolpet: 250 రోజుల్లో 102 కేసులు

- ‘ఆపరేషన్‌ ధూల్‌పేట్‌’లో రికార్డు

- 425 మందిపై కేసులు నమోదు

హైదరాబాద్‌ సిటీ: ఆపరేషన్‌ ధూల్‌పేట్‌(Operation Dhoolpet)లో భాగంగా 250 రోజుల్లో 102 కేసులు నమోదు చేసి ఎక్సైజ్‌ శాఖ అధికారులు రికార్డు సృష్టించారు. గంజాయి అమ్మకాలకు కళ్లెం వేశారు. అమ్మకందార్ల పాలిట ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడులు సింహస్వప్నంగా మారాయి. ఇప్పటి వరకు 425 మందిపై కేసులు నమోదు చేసి, 327 మందిని జైలుకు పంపించినట్లు ఎక్సైజ్‌ పోలీసులు తెలిపారు. 401 కేజీల గంజాయిని పట్టుకొని ఒకరిపై పీడీ యాక్టు పెట్టామన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: AV Ranganath: రాంకీ కబ్జాపై రంగనాథ్‌ పరిశీలన..


city2.jpg

85మంది తప్పించుకు తిరుగుతున్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని తెలిపారు. ధూల్‌పేట్‌(Dhoolpet)లో గంజాయి అమ్మకాలు పూర్తి స్థాయిలో నిర్మూలనే లక్ష్యంగా ఎక్సైజ్‌ శాఖ దాడులను మరింత ముమ్మరం చేస్తోందని వివరించారు. గంజాయి అమ్మకాలు ధూల్‌పేట్‌లో 90 శాతం కనుమరుగయ్యాయన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం

ఉదయం ఎండ .. సాయంత్రం వాన

నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ లైన్లు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 09 , 2025 | 07:32 AM