Share News

Hyderabad: అమ్మకానికి అరుదైన అలెగ్జాండ్రిన్‌ రామచిలుకలు

ABN , Publish Date - Jan 22 , 2025 | 07:04 AM

అమ్మకానికి తరలిస్తున్న అరుదైన అలెగ్జాండ్రిన్‌ రామచిలుకలను(Alexandrine parrots) అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైకోర్టు సమీపంలో విధులు నిర్వహిస్తున్న సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు(South Zone Task Force Police) అనుమానాస్పదంగా ఉన్న ఓ వ్యక్తి వాహనాన్ని తనిఖీ చేయగా బాక్సుల్లో భద్రపర్చిన 110 అలెగ్జాండ్రిన్‌ రామచిలుకలు ఉన్నట్లు గుర్తించారు.

Hyderabad: అమ్మకానికి అరుదైన అలెగ్జాండ్రిన్‌ రామచిలుకలు

- నిందితుడి అరెస్ట్‌.. 110 రామచిలుకలు స్వాధీనం

హైదరాబాద్‌: అమ్మకానికి తరలిస్తున్న అరుదైన అలెగ్జాండ్రిన్‌ రామచిలుకలను(Alexandrine parrots) అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైకోర్టు సమీపంలో విధులు నిర్వహిస్తున్న సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు(South Zone Task Force Police) అనుమానాస్పదంగా ఉన్న ఓ వ్యక్తి వాహనాన్ని తనిఖీ చేయగా బాక్సుల్లో భద్రపర్చిన 110 అలెగ్జాండ్రిన్‌ రామచిలుకలు ఉన్నట్లు గుర్తించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hero Darshan: హీరో దర్శన్‌ తుపాకీ లైసెన్స్‌ రద్దు


నిందితుడ్ని అదుపులోకి తీసుకుని, రామచిలుకలు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం అరణ్యభవన్‌లోని అటవీశాఖ ఉన్నతాధికారులకు అప్పగించారు. మహ్మద్‌ ఫారూక్‌ అరుదైన అలెగ్జాండ్రిన్‌ రామచిలుకలను కొనుగోలు చేసి మరొకచోట వెయ్యి రూపాయలకు అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పీసీసీఎఫ్‌ (ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌) (హెచ్‌ఓఎఫ్ఎఫ్‌) ఆర్‌.ఎం. డోబ్రియల్‌ స్పష్టం చేశారు.


city1.jpg

స్వాధీనం చేసుకున్న రామచిలుకల పిల్లలను హైదరాబాద్‌ నెహ్రూ జూపార్క్‌(Hyderabad Nehru Zoo Park)కు తరలించాలని అధికారులను ఆదేశించారు. పట్టుబడ్డ నిందితుడ్ని రిమాండ్‌కు తరలించారు. పీసీసీఎఫ్(కంపా) సువర్ణ, ఏపీసీసీఎ్‌ఫ(అడ్మిన్‌) సునీత భగవత్‌, వైల్డ్‌ లైఫ్‌ ఓఎస్డీ శంకరన్‌, రంగారెడ్డి డీఎ్‌ఫఓ సుధాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్‌ ప్రభుత్వానిది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలనే

ఈవార్తను కూడా చదవండి: Bandi Sanjay: రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం

ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెరగాలి

ఈవార్తను కూడా చదవండి: Illegal Kidney Transplants: కిడ్నీ రాకెట్‌ గుట్టు రట్టు!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 22 , 2025 | 07:04 AM

News Hub