Share News

Police: పోలీసు శాఖ ఆదేశం.. ఆ షాపుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి

ABN , Publish Date - Mar 15 , 2025 | 12:16 PM

దుకాణాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు పధాన పాత్ర వహిస్తాయని, కావు ప్రతి షాపులో ఈ సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది.

Police: పోలీసు శాఖ ఆదేశం.. ఆ షాపుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి

- పోలీసు శాఖ ఆదేశం

చెన్నై: కత్తులు, కొడవళ్లు, సుత్తి తదితర వస్తువులు తయారుచేసే వర్క్‌ షాపుల్లో సీసీ కెమెరాలు(CCTV cameras) విధిగా అమర్చాలని పోలీసు శాఖ ఆదేశించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ, నగర పోలీసు కమిషనర్లకు జారీచేసిన ఉత్తర్వుల్లో... హత్యలు సహా పలు నేరాలకు పాల్పడుతున్న రౌడీలకు కత్తులు, కొడవళ్లు తదితర ఆయుధాలు లభించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకోసం పోలీసుస్టేషన్ల పరిధిలో కత్తి సహా ఆయుధాలు తయారీ వర్క్‌ షాప్‌ యజమానుల సెల్‌ఫోన్లు నెంబర్లు సేకరించాలన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Pawan Kalyan: దేశాన్ని ముక్కలు చేస్తారా.. స్టాలిన్‌కు గట్టిగా ఇచ్చిపడేసిన పవన్ కళ్యాణ్


nani1.2.jpg

ఎన్ని ప్రాంతాల్లో ఆయుధాల తయారీ వర్క్‌ షాప్‌లున్నాయని గుర్తించాలన్నారు. వ్యవసాయం, ఇంటి వినియోగం కోసం కొడవళ్లు తదితరాలు కొనుగోలు చేస్తున్నట్లు వర్క్‌షాప్‌(Work Shop) యజమానులు ధ్రువీకరించుకోవాలన్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా కత్తులు, కొడవళ్లు కొనుగోలు చేస్తే వెంటనే పోలీసు స్టేషన్‌కు తెలియజేయాలని సూచించాలన్నారు. అలాగే, ఆయుధాల తయారీ వర్క్‌షాపుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని తెలియజేయడంతో పాటు పర్యవేక్షించాలని పోలీసు శాఖ ఉత్తర్వుల్లో ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Arjun Reddy: గ్రూప్‌-3 టాపర్లూ పురుషులే..

నాగారంలోని ఆ 50 ఎకరాలు భూదాన్‌ భూములు కావు

కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై.. తుది దశకు సాధ్యాసాధ్యాల అధ్యయనం

మా సిఫారసు లేఖలు తీసుకోవాలి

Read Latest Telangana News and National News

Updated Date - Mar 15 , 2025 | 12:16 PM