ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: వాట్సాప్‏లో వచ్చిన లింకును క్లిక్‌ చేశాడు.. రూ. 14లక్షలు పోగోట్టుకున్నాడు

ABN, Publish Date - Apr 02 , 2025 | 07:37 AM

నగరంలో.. సైబర్ మోసాలు అడ్డే లేకుండా పోతోంది. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఈ తరహా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు కూడా లక్షలు.. కాదు.. కాదు.. కోట్లల్లో మోసపోతూనే ఉన్నారు. పెరిగిన టెక్నాలజీని వాడుకుంటూ నిత్యం ఎక్కడో ఒకచోట ఇటువంటి మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు.

హైదరాబాద్‌ సిటీ: స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ టిప్స్‌ ఇస్తామని నమ్మించిన సైబర్‌ కేటుగాళ్లు నగరానికి చెందిన వ్యాపారి నుంచి రూ.14.63 లక్షలు కొల్లగొట్టారు. డీసీపీ కవిత(DCP Kavitha) తెలిపిన వివరాల ప్రకారం, నగరానికి చెందిన వ్యాపారికి ఇటీవల ఒక గుర్తుతెలియని వ్యక్తి నుంచి వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చింది. ఆన్‌లైన్‌లో స్టాక్‌మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, ట్రేడింగ్‌పై మంచి టిప్స్‌ ఇస్తానని నమ్మించాడు.

ఈ వార్తను కూడా చదవండి: CV Anand: లైసెన్స్‌డ్‌ తుపాకులు అప్పగించాలి


అతి తక్కువ సమయంలో 20శాతం లాభాలు అందుకోవచ్చని బురిడీ కొట్టించాడు. బాధితుడు అతని మాటలు నమ్మి వాట్సా్‌ప్‏(WhatsApp)లో వచ్చిన లింకును క్లిక్‌ చేశాడు. ఆ తర్వాత పలు ట్రేడింగ్‌ వాట్సాప్‌ గ్రూపుల్లో బాధితున్ని చేర్చాడు. ప్రారంభంలో లాభాలు వచ్చినట్లు చూపించాడు. ఆ తర్వాత బల్క్‌ స్టాక్స్‌, ఐపీవోస్‏ల పేరుతో రూ. 14.63 లక్షలు పెట్టుబడులు పెట్టించాడు.


అనంతరం విత్‌డ్రా ఆప్షన్‌ తొలగించాడు. దీనిపై ప్రశ్నించగా మరింత ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని ఒత్తిడి చేశారు. ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు(City Cyber ​​Crime Police) ఫిర్యాదు చేశారు. టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ద్వారా పోలీసులు నోయిడాకు చెందిన అంతర్రాష్ట్ర సైబర్‌ ముఠాలోని శివశంకర్‌ను అరెస్టు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Ipupuva Laddu: ఇప్పపువ్వు లడ్డూ!

విధ్వంసమే మీ ఎజెండానా

డబుల్‌ బెంబేలు

ప్రయాణికులకు తప్పనున్న చిల్లర తిప్పలు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 02 , 2025 | 07:37 AM