Share News

Fish: గొంతులో చిక్కుకున్న చేప.. శ్వాస తీసుకోలేక యువకుడి మృతి

ABN , Publish Date - Apr 12 , 2025 | 02:01 PM

ఓ బతికున్న చేప గొంతులో ఇకుక్కోవడంతో ఓ యుకకుడు మృతిచెందిన విషాధ సంఘటన ఇది. చేపలు పట్టేందుకు వెళ్లిన ఆ యువకుడికి ఓ చేప దొరికింది. అది అటుఇటు ఎగురుతుండగా దానిని తన నోటితో పళ్ల మధ్య పెట్టుకున్నన్నాడు. అది ఒక్కసారిగా గొంతులోకి జారి ఇరుక్కుపోయి శ్వాస ఆడక మృతిచెందాడు

Fish: గొంతులో చిక్కుకున్న చేప.. శ్వాస తీసుకోలేక యువకుడి మృతి

చెన్నై: ఊహించని విధంగా బతికిన చేప గొంతులోకి వెళ్లి శ్వాస తీసుకోలేక యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన స్థానిక మధురాంతకంలో జరిగింది. మధురాంతకానికి చెందిన మణికంఠన్‌ (29) స్నేహితులతో కలసి సమీపంలోని కీళవలవు చెరువులో చేపలు పడుతుంటాడు. ఘటన జరిగిన రోజున మణికంఠన్‌ ఒక్కడే వేటకు వెళ్లాడు. అతని వద్ద గాలాలు, వలలు లేకపోవడంతో చేతులతోనే చేపలు పట్టాలని నిర్ణయించుకున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: నల్లాలకు బిగించిన మోటర్లు సీజ్‌..


నీరు తక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లిన మణికంఠన్‌కు ఒకేసారి రెండు చేపలు చిక్కాయి. చేపలు బతికుండి గిలగిలా కొట్టుకుంటుండగా, రెండింటిని చేతిలో పట్టుకోలేని అతను, ఒక చేపను నోటి మందు పళ్ల మధ్య పెట్టుకొని, మరో చేపను చేతిలో పట్టుకున్నాడు. ఊహించని విధంగా పళ్ల మధ్య ఉన్న చేప నోటిలోకి వెళ్లి, అక్కడి నుంచి గొంతులోకి వెళ్లింది.


city5.2.jpg

దీంతో, శ్వాస తీసుకొనేందుకు ఇబ్బంది పడిన మణికంఠన్‌, హూటాహుటిన చెరువు నుంచి బయటకు వచ్చి ఇంటికెళ్లాడు. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు నోట్లో చిక్కిన చేపను వెలికితీసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా, అతను స్పహతప్పాడు. అతన్నివెంటనే చెంగల్పట్లు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా

ఒక్క క్లిక్‌తో స్థలాల సమస్త సమాచారం!

రైల్వే తీరుతో ప్రయాణికుల పరేషాన్‌

Read Latest Telangana News and National News

Updated Date - Apr 12 , 2025 | 02:01 PM