MahaKumbh 2025: మహా కుంభమేళాలో తదుపరి అమృత స్నానం ఎప్పుడు? శుభ సమయం, తేదీలు ఇవే..
ABN , Publish Date - Feb 10 , 2025 | 08:27 AM
ఇప్పటికే కుంభమేళాలో నాలుగు రాజ స్నానాలు పూర్తయ్యాయి. భోగి, మకర సంక్రాంతి, పుష్య బహుళ అమావాస్య, వసంత పంచమి రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై నాలుగు రాజ స్నానాలు చేశారు. ఐదో రాజ స్నానానికి కూడా సమయం ఆసన్నమైంది. ఐదో రాజ స్నానం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఉత్తరప్రదేశ్ (UttarPradesh)లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా (MahaKumbh) మొదలై దాదాపు నెల రోజులు కావొస్తున్నా భక్తుల తాకిడి మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే 40 కోట్ల మందికి పైగా భక్తులు కుంభమేళాకు హాజరై పవిత్ర స్నానాలు చేసినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ రోజుకు లక్షల మంది ప్రయాగ్‌రాజ్ (Prayagraj)కు తరలి వస్తున్నారు. ఇప్పటికే కుంభమేళాలో నాలుగు రాజ స్నానాలు పూర్తయ్యాయి. భోగి, మకర సంక్రాంతి, పుష్య బహుళ అమావాస్య, వసంత పంచమి రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై నాలుగు రాజ స్నానాలు (Holy Baths) చేశారు. ఐదో రాజ స్నానానికి కూడా సమయం ఆసన్నమైంది. ఐదో రాజ స్నానం (Amrit Snan) గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కుంభమేళాలో తదుపరి రాజ స్నానం లేదా అమృత స్నానం మాఘ పూర్ణిమ రోజున జరగబోతోంది. అంటే ఈ నెల 12వ తేదీన మాఘ పూర్ణిమ రోజున ఈ పుణ్య స్నానం జరగబోతోంది. ఫలవంతమైన, పుణ్య స్నానం కోసం ఎదురుచూస్తున్న వారు, ఈ తేదీన మహా కుంభమేళాకు వెళ్ళవచ్చు. మాఘ పూర్ణిమ రోజున స్నానం చేయడం, దానధర్మాలు చేయడం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినవిగా భావిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం 06.55 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 12వ తేదీ సాయంత్రం 07.22 గంటల వరకు ఉంటుంది.
సాధారణంగా ఉదయ తిథికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి ఫిబ్రవరి 12 ఉదయం కుంభమేళాలో పుణ్య స్నానం చేస్తారు. ఈ రోజున కూడా కోట్లాది మంది భక్తులు స్నానాలు ఆచరించడానికి వస్తారని అంచనా వేస్తున్న అధికారులు అందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. మాఘ పూర్ణిమ తర్వాత మరో రాజ స్నానాన్ని మహా శివరాత్రి నాడు చేస్తారు. శివరాత్రితోనే కుంభమేళా పూర్తవుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తలు కోసం క్లిక్ చేయండి..