Share News

Hanuman Jayanti: ఇలా చేయండి.. చాలు..

ABN , Publish Date - Apr 11 , 2025 | 04:39 PM

Hanuman Jayathi: ఏడాదిలో రెండు హనుమాన్ జయంతిలు వస్తాయన్న సంగతి మీకు తెలుసా?. కేసరి నందనుడు జన్మదినం సందర్భంగా ఆయనకు అత్యంత ప్రీతి పాత్రమైన పలహారం ఏమిటో తెలుసా? అసలు హనుమాన్ జయంతి సందర్భంగా ఏం చేయాలి. ఏం చేయకూడదో మీకు తెలుసా? వీటి గురించి సమగ్రం తెలుసుకోవాలంటే...

Hanuman Jayanti: ఇలా చేయండి.. చాలు..
Lord Hanuman

హనుమంతుడి దయ ఉంటే.. అన్ని ఉన్నట్లే. నిత్యం కొలిస్తే హనుమంతుడు అండ.. దండ.. గా ఉంటారని ఆయన భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. హనుమాన్ జయంతి రేపు. అంటే ఏప్రిల్ 12వ తేదీ చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు.. హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఆయన జయంతిని పురస్కరించుకొని.. పలు దేవాలయాల్లో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారు. అలాగే వివిధ దేవాలయాల్లో సుందరకాండ, రామాయణం పారాయణం చేస్తారు.అయితే ఈ రోజు స్వామి వారికి ప్రసాదంగా వీటిని సమర్పిస్తే.. ఆయన అనుగ్రహం తప్పక కలుగుతోందని పండితులు చెబుతారు.

బేసన్.. బూందీ లడ్డూలతోపాటు జాంగ్రీ..

హనుమంతుడికి బేసన్ లడ్డూ అత్యంత ప్రీతికరమైనది. ఆయన జన్మదినం సందర్భంగా ఈ లడ్డూ సమర్పించడం వల్ల ఆయన భక్తులు కోరుకున్న ఫలితాలు పొందుతారు. అలాగే బూందీ లడ్డూ కూడా ఆయన అత్యంత ప్రీతికరమైనది. ఈ లడ్డూను సైతం స్వామి వారికి సమర్పించడం వల్ల.. భక్తుడికి కావలసి వరం ఇస్తాడు. ఆంజనేయస్వామిని సులభంగా ప్రసన్నం చేసుకోవాలంటే.. ఆయనకు జాంగ్రీ సమర్పించాలి. దీంతో భక్తుడికి నెరవేరని ప్రతి కోరిక నెరవేరుతోంది.


నైవేద్యంగా బెల్లం, పప్పు..

హనుమంతుడికి బెల్లం, పప్పు నైవేద్యం పెట్టడం వల్ల మంగళ దోషం తొలగిపోతుందని చెబుతారు. ఇది అన్ని సమస్యల నుంచి భక్తులకు ఉపశమనం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడికి బెల్లం, పప్పు నైవేద్యం పెట్టాలి.

అరటిపండు

పవనసుత హనుమాన్‌కు అరటి పండు నైవేద్యంగా పెట్టాలి. ఎందుకంటే ఆయనకు ఇవి అత్యంత ప్రీతిపాత్రమైనవి. వీటిని నైవేద్యం పెట్టడం ద్వారా.. బజరంగబలి యొక్క ప్రత్యేక ఆశీర్వాదాలను పొందు వచ్చు.

ఖీర్

ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజు.. బజరంగబలికి ఖీర్ నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా.. ఒక వ్యక్తికి ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయి.


హనుమాన్ జయంతి రోజు.. ఈ నియమాలు తప్పక పాటించండి..

  • తెల్లవారుజామున నిద్ర లేవాలి. ముందుగా స్నానం చేసి దుస్తులు ధరించాలి. ఇది ఆధ్యాత్మిక, శారీరక స్వచ్ఛతను సూచిస్తుంది.

  • హనుమంతుని ఆశీర్వాదం పొందడానికి.. హనుమాన్ చాలీసా పఠించాలి. దీనిని 11 లేదా 108 సార్లు పఠించడం శుభప్రదంగా పరిగణిస్తారు.

  • హనుమాన్ ఆలయంలో దండలు, సింధూరంతోపాటు లడ్డూలు తదితర ప్రసాదాల రూపంలో పంచి పెట్టాలి.

  • ఈ రోజు..చాలా మంది అనుచరులు ఉపవాసం ఉంటారు. పండ్లు,పాలు మాత్రమే ఆహారంగా తీసుకుంటారు.

  • రామాయణంలోని సుందర కాండ భాగాన్ని చదవడం వల్ల అనుగ్రహం కలుగుతోంది.

  • ఈ రోజు.. హనుమాన్ విగ్రహం లేదా ఆయన చిత్రాల ముందు ఆగరబత్తులు, నూనె దీపాలు వెలిగించాలి.

  • ఆపదలో ఉన్న వారికి ఆహారం,దుస్తులు లేకుంటే నగదు ఇవ్వండి. ఎందుకంటే ఇతరులకు సహాయం చేయడం ద్వారా హనుమంతుడికి అత్యంత ప్రీతిపాత్రం.


ఏడాదిలో రెండు హనుమాన్ జయంతులు..

ఇవి ఎప్పుడు వస్తాయి.. ఎక్కడ జరుపుకొంటారంటే..

చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు ఒక హనుమాన్ జయంతి వస్తుంది. ఇక రెండోవది మార్గశిర మాసంలో అమావాస్య రోజు.. మరో హనుమాన్ జయంతి వస్తుంది. మరి ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ రెండు హనుమాన్ జయంతులను భక్తి శ్రద్ధలతో భక్తులు జరుపుకుంటారు.

For Devotional News and Telugu News

Updated Date - Apr 11 , 2025 | 04:42 PM