Shivaratri: శంభో.. శివ శంభో..
ABN , Publish Date - Feb 26 , 2025 | 06:33 AM
కోరిన కోర్కెలు తీర్చుతూ.. భక్తులకు కొంగుబంగారాన్ని అందిస్తున్న మహాశివుడి పర్వదినానికి వేళయింది. హర హర మహాదేవ.. అంటూ నీలకంఠ స్వామిని భక్తిప్రపత్తులతో కొలిచేందుకు నగరంలో చిన్నా, పెద్ద అందరూ సిద్ధమయ్యారు.

- శివరాత్రికి ముస్తాబైన శివాలయాలు
హైదరాబాద్ సిటీ: కోరిన కోర్కెలు తీర్చుతూ.. భక్తులకు కొంగుబంగారాన్ని అందిస్తున్న మహాశివుడి పర్వదినానికి వేళయింది. హర హర మహాదేవ.. అంటూ నీలకంఠ స్వామిని భక్తిప్రపత్తులతో కొలిచేందుకు నగరంలో చిన్నా, పెద్ద అందరూ సిద్ధమయ్యారు. ఈ మేరకు త్రినేత్రుడి వేడుకను కనుల పండువగా జరుపుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. మంగళవారం ఇళ్లను శుద్ధి చేసుకోవడంతోపాటు పూజా సామగ్రిని కొనుగోలు చేసుకున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..
ఉపవాసం, జాగరణ ఉండే భక్తులు సాయంత్రం వేళలో పండ్లు, దీపాలు తెచ్చుకున్నారు. శివరాత్రి(Shivaratri) నేపథ్యంలో నగరంలోని ఆలయాలను విద్యుద్దీపాల అలంకరణలతో అందంగా ముస్తాబు చేశారు. జాగరణ ఉండే భక్తుల కోసం పలు ఆలయాల్లో ఎల్‌ఈటీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, హరికథలు, భజనలు, సంకీర్తలను నిర్వహిస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: CVI: ఊబకాయానికి టీకాతో చెక్?
ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ప్రతీ నిర్ణయం బూమరాంగే
ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..
ఈవార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..
Read Latest Telangana News and National News