మోడల్ స్కూల్ సిబ్బందినీ బదిలీ చేయండి
ABN , Publish Date - Apr 16 , 2025 | 05:38 AM
రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం చట్టం తీసుకురావడం శుభ పరిణామం. వీటిలో పారదర్శకతకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నాం. ప్రభుత్వ, జిల్లా పరిషత్...

రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం చట్టం తీసుకురావడం శుభ పరిణామం. వీటిలో పారదర్శకతకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నాం. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ ఉపాధ్యాయులకు చట్ట పరిధిలో బదిలీలు జరుగుతాయి. అదేవిధంగా అతి తక్కువ సంఖ్య ఉన్న ఆంధ్రప్రదేశ్ మోడల్స్ స్కూల్స్ రెగ్యులర్ ఉపాధ్యాయులు కూడా తమ బైలాస్ ప్రకారం బదిలీలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కేవలం 164 మోడల్ స్కూల్స్ మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. వీటిలో జోనల్ వ్యవస్థ ఆధారంగా నియామకాలు జరిగాయి. 2018లో బదిలీ అయిన ఏపీ మోడల్ స్కూల్స్ రెగ్యులర్ ఉపాధ్యాయులు, 2019 డిసెంబర్‌లో డీఎస్సీ 2018 ద్వారా నియామకమైన మోడల్ స్కూల్స్ రెగ్యులర్ సిబ్బంది, ఆదర్శ పాఠశాలల పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు తమకు బదిలీలు నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మెగా డీఎస్సీ–2025 ద్వారా మోడల్ స్కూల్స్‌లో కూడా రెగ్యులర్ పోస్టులు ప్రభుత్వం భర్తీ చేయనుంది. అందువల్ల ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే బదిలీలు నిర్వహిస్తే ఈ పాఠశాలల్లో కూడా క్రమబద్ధీకరణ జరిగి సుదూర ప్రాంతాల్లో ఐదేళ్లకు పైబడి విధులు నిర్వహిస్తున్న వారికి బదిలీల ద్వారా న్యాయం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రభుత్వమైనా న్యాయం చేయాలని వీరు కోరుతున్నారు.
బి. సురేశ్
మోడల్ స్కూల్స్ రెగ్యులర్ టీచర్స్ కమిటీ
ఈ వార్తలు కూడా చదవండి:
Aghori Srinivas: అఘోరీ శ్రీనివాస్‌పై సంచలన ఆరోపణలు.. తనను పెళ్లి చేసుకున్నాడంటూ..
MLC Kavitha: కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత.. పింక్ బుక్ పేరు చెప్తూ..
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..