దేశ ప్రగతికి హేతువాదం కీలకం
ABN , Publish Date - Apr 03 , 2025 | 04:48 AM
ఏ సమాజం అయినా హేతువాదాన్ని పుణికిపుచ్చుకున్నప్పుడు అక్కడ సామాజిక సుస్థిరత వస్తుంది, అభివృద్ధి పరుగులు పెడుతుంది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు ఈ దిశగానే పయనిస్తున్నాయి..

ఏ సమాజం అయినా హేతువాదాన్ని పుణికిపుచ్చుకున్నప్పుడు అక్కడ సామాజిక సుస్థిరత వస్తుంది, అభివృద్ధి పరుగులు పెడుతుంది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు ఈ దిశగానే పయనిస్తున్నాయి. అందుకే ఆ దేశ ప్రజల జీవన ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ఇందుకు ప్రత్యక్ష తార్కాణం అమెరికా. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి స్థిరపడిన ప్రజలు, విభిన్న మతాలు, సంస్కృతుల కలబోతగా ఉన్న అమెరికా నేడు అగ్రరాజ్యంగా ఎదగడానికి హేతువాద సిద్ధాంతాలు కీలకం. యూరోప్ దేశాలు సైతం ఇదే తోవలో వెళ్తున్నాయి. దీనికి భిన్నంగా మతం ఆధారంగా ప్రజలను పాలిస్తున్న పాలస్తీనా, అప్ఘానిస్థాన్ వంటి దేశాల దుస్థితిని మనం చూస్తూనే ఉన్నాం.
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మనం చెప్పుకుంటున్న మన దేశంలో ప్రభుత్వాలు ఎలా ఏర్పడుతున్నాయి అనేది చర్చించాల్సిన అంశం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి 50 ఏళ్లలో నవరత్న కంపెనీలు, ఐఐటీలు, బ్యాంకుల జాతీయీకరణ, పెద్దా చిన్నా ప్రాజెక్టులు, రైల్వేలు, గనులు... ఇలా అనేక రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి నమోదైంది. ఆ కాలంలో దేశంలో ఎన్నికల ప్రస్థానం హేతువాదం అనే అంశం చుట్టూ తిరిగింది. కాంగ్రెస్, కమ్యూనిస్టు, జనతా పార్టీలు ఏనాడూ మతవాదం వైపు తొంగిచూడలేదు. 90వ దశకం నుండి మతవాదాన్ని తెరపైకి తెచ్చిన ఆరెస్సెస్, బీజేపీలు దాన్ని మరింత బలపర్చుకుంటూ వచ్చాయి. ఈ తర్వాత కొనసాగిన ఎన్నికల్లో క్రమంగా అభివృద్ధి, ఆలోచన, ప్రశ్నవంటి ప్రజోపయోగ ఎజెండాలు పక్కదారి పట్టినాయి.
మతవాదం ప్రవచించే పార్టీలకు ప్రజలు తాత్కాలికంగా అధికారాన్ని ఇవ్వొచ్చు కానీ ఆ పార్టీలతో ఏర్పడిన ప్రభుత్వాలు దేశ ప్రజల జీవన ప్రమాణాలను వృద్ధి చేయలేవు. బీజేపీ మతవాదాన్నే ఎన్నికల ఎజెండాగా తీసుకొని, తమ సంస్థల్ని బలంగా నిర్మించుకున్నది. ఎప్పుడు సాధారణ ఎన్నికలు వచ్చినా బీజేపీ ఒక మతానికి, కాంగ్రెస్ మరో మతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయని ఒక ప్రణాళికతో కూడిన ప్రాపగండా గత కొన్ని ఎన్నికల్లో మనం చూస్తున్నాం. దీంతో ఎన్నికల సమయంలో సమాజంలో చర్చకు రావలసిన అంశాలు మరుగునపడుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు
Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News