Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 17 03 2025

ABN , Publish Date - Mar 17 , 2025 | 12:05 AM

శ్రీశ్రీ సాహిత్యంపై సదస్సు, ‘వీర నాగు శతకం’ ఆవిష్కరణ, ప్రపంచ కవితాదినోత్సవ సభ, ‘దీర్ఘ కవితా వికాసం’పై ప్రసంగం, కార్టూన్ల పోటీ...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 17 03 2025

శ్రీశ్రీ సాహిత్యంపై సదస్సు

‘మహాప్రస్థానం’ అమృతోత్సవం సందర్భంగా విజయవాడ, ఆంధ్ర లొయోల కళాశాలలో మార్చి 18, 19 తేదీలలో శ్రీశ్రీ సాహిత్యంపై అంతర్జాతీయ సదస్సు జరుగుతుంది. మార్చి 18 ఉ.10గంటలకు ముమ్మడి సమావేశ మందిరంలో లొయోల కళాశాల ప్రిన్సిపల్ జి.ఏ.పి కిశోర్ అధ్యక్షతన జరిగే ప్రారంభ సదస్సులో కొలకలూరి ఆశాజ్యోతి ముఖ్య అతిథిగా, మాధురి ఇంగువ విశిష్ట అతిథిగా, శ్రీశ్రీ విశ్వేశ్వర రావు, కోయి కోటేశ్వర రావు గౌరవ అతిథులుగా పాల్గొంటారు. ఈ సదస్సులో 35 మందికి పైగా శ్రీశ్రీ సాహిత్యంపై పరిశోధనా పత్రాలు సమర్పిస్తారు.

కోలా శేఖర్

‘వీర నాగు శతకం’ ఆవిష్కరణ

నెలపాడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ సిటీ కళాశాల విద్యార్థి చిక్కొండ్ర రవి రచించిన ‘వీరనాగు’ శతకం ఆవిష్కరణ మార్చి 19 ఉ.10గం టలకు వనపర్తి జిల్లా బుద్ధారం గ్రామంలో ఆర్.డి. ఆర్.యం. యు. పి.యస్ దగ్గర జరుగుతుంది. సభాధ్యక్షులు వనపట్ల సుబ్బయ్య, ముఖ్య అతిథి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విశిష్ట అతిథి గోరటి వెంకన్న, ఆవిష్కర్త మదిరె మల్లమ్మ. వివరాలకు: 94927 65358.

నెలపాడుపు


ప్రపంచ కవితాదినోత్సవ సభ

కవి సంధ్య – చిన్ని నారాయణరావు సాహితీ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో ప్రపంచ కవితా దినోత్సవ సభ మార్చి 23 సా.5గంటల నుంచి కమిటీ హాలు, పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వ విద్యాలయంలో జరుగుతుంది. శిఖామణి అధ్యక్షతన జరిగే సభలో దర్భశయనం శ్రీ నివాసచార్య ‘కవిత్వం- ప్రయోజనం’ అంశంపై ప్రసంగిస్తారు. కవితల పోటీ విజేతలకు బహుమతుల ప్రదానం ఉంటుంది. ముఖ్య అతిథి ఎన్‌.గోపి, గౌరవ అతిథులుగా ఓల్గా, దీర్ఘాశి విజయ్ భాస్కర్, మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొంటారు.

కవి సంధ్య

‘దీర్ఘ కవితా వికాసం’పై ప్రసంగం

వర్తన సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఏడవ సమావేశం మార్చి 23 ఉ.10గంటలకు రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ సమావేశంలో ‘దీర్ఘ కవితా వికాసం’ అంశంపై కాంచనపల్లి గోవర్ధనరాజు ప్రసంగిస్తారు. రూప్ కుమార్ డబ్బీకార్ అధ్యక్షత వహిస్తారు. అందరూ ఆహ్వానితులే.

ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్


కార్టూన్ల పోటీ

మామిడిపూడి రామకృష్ణయ్య స్మారకంగా విశాలాక్షి సాహిత్య మాసపత్రిక నిర్వహణలో కార్టూన్ల పోటీ జరుగుతుంది. మొదటి, రెండవ, మూడవ, నాల్గవ, ఐదవ బహుమతులు వరుసగా: రూ.6వేలు, 5వేలు, 4వేలు, 3వేలు, 2 వేలు. ముప్పై ప్రత్యేక బహుమతులు ఒక్కొక్కటి రూ.1000. ఒక్కొక్కరు రెండు కార్టూన్లు పంపవచ్చు. ఎ4 సైజులో గీసి 300 రిజల్యూషన్‌లో స్కాన్ చేసి మెయిల్ చెయ్యాలి. చివరి తేదీ: మార్చ్‌ 30. కార్టూ న్లు పంపాల్సిన ఈమెయిల్‌: ethakotas@yahoo.com

ఈతకోట సుబ్బారావు

ఈ వార్తలు కూడా చదవండి:

CM Revanth Reddy: దొంగలు, దోపిడీదారులను బట్టలిప్పి నిలబెడతా: సీఎం రేవంత్ రెడ్డి..

DK Aruna: ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు..

Updated Date - Mar 17 , 2025 | 12:05 AM