PGCIL Vacancies 2025:పరీక్ష లేకుండా పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు..నెలకు రూ.2.20 లక్షల జీతం..వెంటనే దరఖాస్తు చేసుకోండి
ABN, Publish Date - Mar 10 , 2025 | 07:42 PM
PGCIL Job Vacancies 2025 Apply Online: మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్నారా.. అయితే మీకు గొప్ప అవకాశం. పవర్ గ్రిడ్ (PGCIL)లో పరీక్ష రాయాల్సిన పనిలేకుండానే గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం. ఈ పోస్టుల కోసం అభ్యర్థులు ఎలాంటి రాత పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలకు..

PGCIL Job Vacancies 2025 Apply Online: నిరుద్యోగ యువతీ యువకులకు అద్భుత అవకాశం. రాత పరీక్ష రాయకుండానే ప్రభుత్వ ఉద్యోగ కల నెరవేర్చుకునే అవకాశం. ఏదొక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేదే మీ ధ్యేయమైతే వెంటనే ఈ జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకోండి. ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ (PGCIL) యువతకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఇటీవల పవర్‌గ్రిడ్‌లో మేనేజర్,డిప్యూటీ మేనేజర్,అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం అభ్యర్థులు ఏ రకమైన రాత పరీక్షకు హాజరు కానవసరం లేదు.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (PGCIL) మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది నిరుద్యోగులకు ఒక గొప్ప అవకాశం. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో కెరీర్ సంపాదించాలని కలలు కంటున్న అభ్యర్థులకు. ఈ నియామకానికి దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పవర్‌గ్రిడ్ అధికారిక వెబ్‌సైట్ www.powergrid.in ని సందర్శించి అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 12 మార్చి 2025. కాబట్టి మీకు ఆసక్తి ఉంటే వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోండి.
ఖాళీల వివరాలు : మేనేజర్ (ఎలక్ట్రికల్)-9,డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్)- 48,అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్)-58
అర్హత :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు B.E/B.tech/B.Sc (ఇంజనీరింగ్) ఎలక్ట్రికల్‌లో డిగ్రీ కలిగి ఉండాలి. దీనితో పాటు అభ్యర్థికి సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. మరిన్ని వివరాలకు అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.
వయోపరిమితి :
అభ్యర్థుల పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. అయితే జనరల్ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 39 సంవత్సరాల వరకు ఉంటుంది.అదే సమయంలో రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కూడా ఉంది.
జీతం, ఇతర ప్రయోజనాలు :
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.60,000 నుంచి రూ.2,20,000 వరకు జీతం లభిస్తుంది. ఇది కాకుండా ఇతర అలవెన్సులు, సౌకర్యాలు కూడా ఉంటాయి.
PGCIL ఎంపిక ప్రక్రియ:
ఈ నియామకంలో ఎంపిక ప్రక్రియ సరళమైనది.అభ్యర్థుల ఎంపిక షార్ట్‌లిస్టింగ్,డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.దీనికి రాత పరీక్ష ఉండదు.
దరఖాస్తు రుసుము :
దరఖాస్తు రుసుము రూ.500. SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులకు ఎటువంటి రుసుము లేదు.
Read Also : Railway Jobs : టెన్త్ అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి..
NCC Police Jobs: డిగ్రీ అర్హతతో..భారత సైన్యంలో లెఫ్టినెంట్ అయ్యే అవకాశం.. నెలకు రూ.56 వేల స్టైఫండ్..
PM Internship 2025 Scheme: టెన్త్ పూర్తయిందా.. ఈ స్కీం కింద నెలకు రూ.5వేలు
మరిన్ని చదువు, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 10 , 2025 | 07:54 PM