Share News

15-Min Jogging Benefits: రోజూ 15 నిమిషాల పాటు జాగింత్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే..

ABN , Publish Date - Apr 03 , 2025 | 03:50 PM

రోజూ కేవలం 15 నిమిషాలు జాగింగ్ చేసిన అద్భుత ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

15-Min Jogging Benefits: రోజూ 15 నిమిషాల పాటు జాగింత్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే..
15 Minutes Jogging Benefits

ఇంటర్నెట్ డెస్క్: జాగింగ్.. అత్యంత అత్యధిక మేలు చేకూర్చే సులువైన కసరత్తు ఇది. కానీ టైం చాలట్లేదంటూ చాలా మంది జాగింగ్ జోలికి వెళ్లరు. టైం ఉన్నా కూడా కొందరు బద్దకిస్తుంటారు. కానీ రోజుకు కేవలం 15 నిమిషాలు జాగింగ్ చేసిన అద్భుత ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాస్తంత బద్ధకం వదిలించుకుంటే జాగింగ్‌తో జీవితాంతం ఆరోగ్యంగా ఉండొచ్చని చెబుతున్నారు.

జాగింగ్‌తో కలిగే ప్రయోజనాలు

జాగింగ్‌తో గుండె పనితీరు, రక్త ప్రసరణ మెరుగవుతాయి. ఫలితంగా బీపీ నియంత్రణలో ఉండి హృద్రోగాలు దరి చేరవు.

ఉదయం పూట జాగింగ్‌తో మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది. ఎండార్ఫిన్లు విడుదలై ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలుగుతుంది. డిప్రెషన్ దరి చేరదు. ఫలితంగా మానసిక ఆరోగ్య మెరుగవుతుంది.


Also Read: టాయిలెట్ సీట్లపై కంటే దిండ్ల కవర్‌లపై ఎక్కువ బ్యాక్టీరియా.. తాజా అధ్యయనంలో వెల్లడి

స్వల్ప దూరాలు జాగింగ్ చేసినా జీవక్రియలు మెరుగవుతాయని అనుభవజ్ఞులు చెబుతున్నారు. అంతిమంగా ఇది బరువు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. కొవ్వు కరగడంతో పాటు కండరాలు కూడా బలోపేతం అవుతాయి. ఫిట్‌నెస్ లక్ష్యాలు చేరుకోవడం సులువవుతంది.

క్రమం తప్పకుండా జాగింగ్ చేసే వారిలో ఊపిరితిత్తులు కూడా బలోపేతం అవుతాయి. వాటి సామర్థ్యం పెరుగుతుంది. ఆయాసం వంటి వాటి నుంచి విముక్తి లభిస్తుంది. రోజూ వారి కార్యక్రమాలు మరింత సులువుగా చేసుకోగలుగుతారు.

ఉదయం పూట క్రమం తప్పకుండా జాగింగ్ చేసేవారిలో ఏకాగ్రత పెరుగుతుందని కూడా అధ్యయనాల్లో రుజువైంది. దీంతో, మరింత ఉత్పాదకతో పనిచేయగలుగుతారు. అప్రమత్తంగా ఉంటూ వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది.


Also Read: ఇంట్లో ఏసీ లేదా.. ఇలా చేస్తే ఎండాకాలంలోనూ కూల్ కూల్

జాగింగ్‌తో కాళ్లల్లోని కండరాలు, ఎముకలు దృఢంగా మారతాయి. కీళ్ల సామర్థ్యం కూడా ఇనుమడించి నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. శరీర కదలికలు మరింత సులువు అవుతాయి. ఆస్టియోపోరోసిస్ ముప్పు కూడా తగ్గుతుంది.

బరువు తగ్గాలనుకునే వారు ఉదయం పూటా రిలాక్సేషన్‌ లేదా రాత్రి మంచి నిద్ర పట్టాలనుకునే వారు సాయంత్రం పూట జాగింగ్ చేయడం మంచిదని కూడా నిపుణులు చెబుతున్నారు. మరి నేటి నుంచే మీరూ జాగింగ్ మొదలెట్టంది.

Read Latest and Health News

Updated Date - Apr 03 , 2025 | 06:16 PM