Banana: ప్రతీ రోజూ అరటి పండు తింటే జరిగేది ఇదే..
ABN , Publish Date - Mar 22 , 2025 | 06:56 PM
సీజన్‌లతో సంబంధం లేకుండా దొరికే పండు ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా అరటి పండే. తక్కువ ధరకు దొరికే అరటి పండు కారణంగా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతీ రోజు ఒక పండు తింటే చాలా సమస్యలు తీరిపోతాయి.

రాజు పేదా తేడా లేకుండా.. ప్రపంచం ఈ మూల నుంచి ఆ మూల వరకు.. ఎవ్వరికైనా.. ఏ సీజన్‌లో అయినా అందుబాటులో ఉండే ఒకే ఒక పండు అరటిపండు. తక్కువ ధరకు దొరకటమే కాదు.. తక్కువ టైంలో ఎక్కువ శక్తిని ఇవ్వటంలో అరటిపండుకు సాటి లేదు. అలాంటి అరటిపండు కారణంగా ఆరోగ్య పరంగా మనకు చాలా లాభాలు ఉన్నాయి. అరటిపండులో ఉండే హై ఫైబర్, పొటాషియంతో పాటు మిగిలిన పోషకాలు మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. రోజుకు కనీసం ఒక అరటిపండు తిన్నా చాలు.. ఆరోగ్యంగా ఉంటాము. అరటిపండు ఆరోగ్య ప్రయోజనాల గురించి చూసుకుంటే చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఇవే..
జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది
అరటి పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కారణంగా మన పేగుల పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్దకంతో ఇబ్బందిపడేవాళ్లు రోజుకు ఒక అరటిపండు తింటే అంతా సెట్ అవుతుంది. ఫైబర్ బరువును అదుపులో ఉంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.
గుండె పని తీరు మెరుగుపడుతుంది
అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఆ పొటాషియం కారణంగా రక్త పోటు అదుపులో ఉంటుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
తక్షణ శక్తి
అరటి పండు తింటే మనకు వెంటనే శక్తి లభిస్తుంది. జిమ్ వర్కవుట్లు చేసే వాళ్లు ప్రీ వర్కవుట్ మీల్‌గా అరటిపండును తీసుకోవడం మంచి చాయిస్ అవుతుంది.
మూడు మెరుగుపడుతుంది
అరటి పండులో ఉండే ట్రైఫ్టోఫాన్ అనే అమినోయాసిడ్ కారణంగా మన శరీరంలో సెరోటనిన్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ సెరోటనిన్ కారణంగా మనకు ఒత్తిడి నుంచి రిలీఫ్ దొరుకుతుంది.
ఎముకల ఆరోగ్యం
అరటిపండులో మెగ్నీషియం, మాంగనీస్ ఉంటాయి. వీటి కారణంగా ఎముకలు దృఢంగా తయారు అవుతాయి.
చర్మం ఆరోగ్యంగా ఉంటుంది
అరటి పండులో సీ విటమిన్ ఉంటుంది. సీ విటమిన్ కారణంగా కొల్లాజిన్ ఉత్పత్తి జరుగుతుంది. కొల్లాజిన్ కారణంగా మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
మరీ ఇంత దారుణంగా ఉన్నారేంట్రా.. చిల్లర కోసం..
Jairam Ramesh: మోదీ ఎప్పుడు వెళ్తారు? అమిత్‌షా ఎందుకు మాట్లాడలేదు?
Earth Hour 2025: ఈరోజు ఎర్త్ అవర్..ఈ టైంలో కరెంట్ బంద్ చేసి, ప్రకృతికి సహకరిద్దాం..