Meditation Tips: ఇలా ధ్యానం చేస్తే ఎన్ని సమస్యలు వచ్చినా ప్రశాంతంగా ఉంటారు..
ABN , Publish Date - Apr 16 , 2025 | 06:54 AM
మీరు క్రమం తప్పకుండా ధ్యానం చేసినప్పుడు కొద్దికొద్దిగా దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.అయితే, మీ ధ్యానంను మరింత ప్రభావవంతంగా మార్చడానికి కొన్ని సాధారణ చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Meditation Tips: నేటి బిజీ లైఫ్‌లో ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. ధ్యానం అనేది ఎటువంటి ఖర్చు లేకుండా మిమ్మల్ని లోపల నుండి బలంగా, సమతుల్యంగా మార్చగల ఒక సాధారణ పరిష్కారం. ఇది కేవలం ఋషులు, సాధువుల కోసం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, మీ ధ్యానంను మరింత ప్రభావవంతంగా మార్చగల కొన్ని సాధారణ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చిన్నగా ప్రారంభించండి
మీరు ధ్యానంను ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే మొదట 5-10 నిమిషాలు ప్రారంభించండి. క్రమంగా, మనస్సు స్థిరంగా మారడం ప్రారంభించినప్పుడు, మీరు సమయాన్ని పెంచుకోవచ్చు. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడం కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. క్రమంగా ధ్యానం సమయంను 30-40 నిమిషాలు పెంచడానికి ప్రయత్నించండి.
ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోండి
ధ్యానం చేయడానికి పరిశుభ్రమైన, ప్రశాంతమైన ప్రదేశం చాలా అవసరం. ఇంట్లో ఎవరూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టని ఒక స్థలంలో ధాన్యం చేయడం మంచిది. మొబైల్, టీవీ లేదా ఇతర అంతరాయాలను దూరంగా ఉంచండి. కేవలం మీ శ్వాసపై దృష్టి పెట్టండి. శ్వాస అనేది ధ్యానానికి ఉత్తమ మార్గం. నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకొని బయటకు వదలండి, మీ దృష్టిని మీ శ్వాసపై ఉంచండి. మీ మనసు అదుపులో ఉంచుకుని శ్వాస వైపు మళ్ళించండి.
ఒత్తిడిని వదిలించుకోండి
ధ్యానం ముఖ్య ఉద్దేశ్యం ఒత్తిడి నుండి రిలీఫ్‌గా ఉండటం. మీ ఆలోచనలను బలవంతంగా ఆపడం కాదు.. ధ్యానం చేస్తే క్రమంగా మనస్సు దానంతట అదే ప్రశాంతంగా మారడం ప్రారంభిస్తుంది. ప్రతిరోజు ధ్యానం కోసం ఒక సమయం కేటాయించండి. ఎందుకంటే, ఇది ఒక రోజులో ఫలితాలను చూపించే అద్భుతం కాదు. కాబట్టి, ప్రతిరోజూ ఒక నిర్ణీత సమయంలో ధ్యానం చేయండి. అది ఉదయం అయినా లేదా రాత్రి అయినా. మీరు క్రమం తప్పకుండా ధ్యానం చేసినప్పుడు, కొద్దికొద్దిగా దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా, మీరు మీ ఒత్తిడిని తగ్గించుకోవడమే కాకుండా మీ మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు.
Also Read:
US Government: కంప్యూటర్ చిప్స్, ఫార్మాపై సుంకాల దిశగా అమెరికా పరిశోధన షురూ
Gold, Silver Rate: భారీ ఊరట.. దిగి వస్తోన్న బంగారం ధర
Federal Funds Suspension: హార్వర్డ్ నిధులకు ట్రంప్ ఎసరు