Share News

Coconut Water: కొబ్బరి నీళ్లు తాగుతున్నారా.. జాగ్రత్త.. ప్రాణాలు పోతాయి..

ABN , Publish Date - Apr 03 , 2025 | 09:35 PM

Coconut Water: కొబ్బరి నీళ్లు తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది కొంచెం రేటు ఎక్కువైనా సరే.. తరచుగా కొబ్బరి నీళ్లు తాగుతూ ఉన్నారు. మరికొంత మంది.. బోండాలను తక్కువ ధరకు.. ఎక్కువ మొత్తంలో కొని వాటిని ఇంట్లో భద్రపరుచుకుంటూ ఉన్నారు. వారానికో, నెలకో వాటిని తాగుతూ ఉన్నారు. అలా చేయటం ప్రాణాల మీదకు తెస్తుందని గుర్తించటం లేదు.

Coconut Water: కొబ్బరి నీళ్లు తాగుతున్నారా.. జాగ్రత్త.. ప్రాణాలు పోతాయి..
Coconut Water

ఎండాకాలం వచ్చిందంటే చాలు కొబ్బరి బోండాలకు విపరీతమైన గిరాకీ ఏర్పడుతుంది. మామూలు టైంలో కంటే ఇప్పుడు రేట్లు మండిపోతాయి. హైదరాబాద్ సిటీలో కొబ్బరి బోండాల ధర.. ఏరియాలను బట్టి.. కాయ సైజను బట్టి.. అది తీసుకొచ్చిన ప్రాంతాన్ని బట్టి 50 నుంచి 70 రూపాయల వరకు ఉంటోంది. కొంతమంది డబ్బులకు వెనకాడకుండా.. ఆరోగ్యం బాగా ఉంటే చాలు అనుకుని తరచుగా కొబ్బరి బోండాలు తాగుతున్నారు. కొబ్బరి నీళ్లు తాగటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ, కొబ్బరి బోండాం పరిస్థితి ఏంటి?.. అందులోని నీళ్లు ఎలా ఉన్నాయో చూసుకోకుండా తాగితే.. ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది.


తాజాగా, ఓ వృద్ధుడు కొబ్బరి నీళ్లు తాగి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన డెన్మార్క్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. డెన్మార్క్‌లోని అర్హస్‌కు చెందిన 69 ఏళ్ల ఓ వృద్ధుడు కొద్దిరోజుల క్రితం కొబ్బరి బోండాం కొన్నాడు. దాన్ని తాగకుండా నెల రోజుల పాటు కిచెన్‌లో పెట్టాడు. ఆ టెంకాయ పాడైందా లేదా అని చూసుకోలేదు. స్ట్రా పెట్టి నీళ్లు తాగాడు. అది కూడా కొన్ని చుక్కలు మాత్రమే తాగాడు. కుళ్లిపోయిన వాసన రావటంతో వెంటనే తాగటం ఆపేశాడు. దాన్ని చెత్త బుట్టలో పడేశాడు. సరిగ్గా మూడు గంటల తర్వాత అతడి ఆరోగ్యం క్షీణించటం మొదలైంది. విపరీతంగా చెమటలు పట్టాయి. వాంతులు మొదలయ్యాయి. దీంతో అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

COCONUT.jpg


డాక్టర్లు అతడికి ఏమైందో తెలుసుకోవడానికి ఎమ్‌ఆర్‌ఐ స్కాన్ చేశారు. అతడి మెదడు బాగా ఉబ్బినట్లు తేలింది. కానీ, మెదడు అలా ఎందుకు ఉబ్బిందో వారికి అర్థం కాలేదు. పెద్దాయన్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందించకుండా ఆలస్యం చేశారు. సరిగ్గా 26 గంటల తర్వాత ఆయన బ్రెయిన్ డెడ్ అయింది. తర్వాత చనిపోయాడు. పోస్టుమార్టం రిపోర్టులో ఆయన చావుకు కారణం తెలిసింది. ఓ ఫంగస్ కారణంగా ఆయన బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు గుర్తించారు. కొబ్బరి కాయను బద్దలు కొట్టి చూడగా.. అది బాగా కుళ్లిపోయి ఉంది. కాగా, కొన్ని రకాల ఫంగస్‌లు ప్రమాదకరమైన కాంపౌండ్ 3 నిట్రోప్రోపియానిక్ యాసిడ్‌ను ఉత్పత్రి చేస్తాయని, ఆ యాసిడ్ మెదడును డ్యామేజ్ చేస్తుందని పరిశోధనల్లో తేలింది.


ఇవి కూడా చదవండి:

Filmmaker Sanoj Mishra: సనోజ్ మిశ్రాపై రేప్ కేసు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన నటి

Weather Updates: ఆ 22 జిల్లాలకు బిగ్ అలర్ట్.. 3 రోజులు దబిడి దిబిడే..

Updated Date - Apr 03 , 2025 | 09:40 PM