ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips : బరువు తగ్గేందుకు.. తిండి మానేయడం కరెక్టేనా?

ABN, Publish Date - Jan 08 , 2025 | 12:31 PM

బరువు తగ్గడమే మీ లక్ష్యమా. అందుకోసం తరచూ తినడం మానేస్తున్నారా? అలా చేయాల్సిన పనిలేదు. ఉపవాసాలు.. గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్లు చేయకుండానే.. ఇలా బరువు ఈజీగా బరువు తగ్గించుకోవచ్చు..

Weight Loss Tips

అధిక బరువు ఎన్ని సమస్యలకు కారణవుతుందో అందరికీ తెలుసు. సొంత పనులు చేసుకోవ్వకుండా ఇబ్బందులు పెడుతుంది. ఇలాంటి వారు నలుగురిలో కలవాలంటేనే భయపడుతుంటారు. శరీర ఆకారాన్ని చూసుకుని కుంగిపోతూ ఆత్మన్యూనతాభావంతో ఒంటరిగా ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబంతో కలిసి పార్టీలు, ఫంక్షన్లకు హాజరయ్యేందుకు అనాసక్తి చూపుతారు. ఎలాగైనా అధిక బరువు వదిలించుకోవాలని అనుకునేవారు తినటం మానేసి కడుపు మాడ్చుకుంటూ ఉంటారు. తరచూ ఉపవాసాలు చేయటం చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల బరువు తగ్గినా డీహైడ్రేషన్ సమస్య తలెత్తి నీరసం ఆవహిస్తుంది. ఇలాగే ఎక్కువ కాలం తినకుండా ఉంటే రోగనిరోధక శక్తి తగ్గి ఇతర వ్యాధుల బారిన పడే అవకాశముంది. అయితే, సుదీర్ఘ ఉపవాసాలు.. గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్లు చేయకుండానే ఆహారం, జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు. బరువుని కంట్రోల్ చేయవచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.


ఇంట్లో రాత్రి వండిన అన్నం, కూరలు మిగిలిపోయాయనో, పాడవుతాయనో ఆకలి తీరినా ఎక్కువ మొత్తంలో తినేస్తుంటారు చాలామంది మహిళలు. రుచికరంగా ఉంటాయని తరుచూ వేపుళ్లు, ఫాస్ట్‌‌ఫుడ్, జంక్‌ఫుడ్‌లూ తరచూ తినడం చాలామందికి అలవాటు. ఇలా చేస్తే వేగంగా బరువు పెరిగే ప్రమాదముంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. తీరా లావయ్యాక చింతిస్తూ ఉంటారు. అప్పటి నుంచి తిండి తినకుండా మానేయడం లాంటివి చేస్తుంటారు. సడెన్‌గా తినడం మానేస్తే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదముంది.


బరువు తగ్గాలంటే రోజుల తరబడి ఉపవాసాలు.. గంటల తరబడి వర్కవుట్లు వద్దే వద్దు. ఆరోగ్యకర జీవనశైలే ముద్దు అంటున్నారు పోషకాహార నిపుణులు. పర్‌ఫెక్ట్ డైట్ అనుసరిస్తూ కంటినిండా నిద్రపోతే చాలు. బరువు దానంటదే అదుపులోకి వస్తుందని సూచిస్తున్నారు.

1. ప్రతిఒక్కరూ రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీళ్లు తాగటం చాలా ముఖ్యం. తగినంత నీటిని తీసుకోకపోతే శరీరం డీహైడ్రేషన్ బారిన పడి రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. శరీరంలోని మలినాలు, వ్యర్థాలు బయటికి పోవాలంటే నీరు తాగటం అవసరం. అప్పుడే వ్యాధుల బారిన పడకుండా ఉంటాం. బరువూ కంట్రోల్‌లో ఉంటుంది.

2. జంక్‌ఫుడ్, వేపుళ్లు, బేకరీ పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మేలు. దానికి బదులు తాజా పండ్లు, ఆకుకూరలు, సలాడ్లు తినటం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంతో పాటు మెరిసే చర్మమూ మీ సొంతమవుతుంది.


3. చక్కెరకు బదులుగా బెల్లం, తేనెలు తీసుకుంటూ ఉండండి. ఇవి రుచిగా ఉండటంతో పాటు బరువూ తగ్గేందుకు సహాయపడతాయి.

4. ఒంట్లో కెలోరీలు కరగాలంటే వ్యాయామం తప్పనిసరి. అందుకు భారీ వర్కవుట్లే చేయాల్సిన పనిలేదు. ఇంట్లోనే రోజూ కనీసం గంటైనా చిన్నపాటి ఆసనాలు వేస్తూ ఉంటే చాలు. బరువు తగ్గి శరీరం తేలికగా అవటమే గాక మనసుకీ హాయిగా ఉంటుంది.

5. ఎంత తిన్నా, ఎన్ని వర్కవుట్లు చేసినా శరీరానికి తగినంత విశ్రాంతి లేకపోతే వృథానే. రోజూ 7-8 గంటల నాణ్యమైన నిద్రతోనే మనసు, శరీరం పునరుత్తేజం పొందుతాయని గుర్తుంచుకోవాలి.

Updated Date - Jan 08 , 2025 | 12:31 PM