Asrtro Tips : నిద్ర లేవగానే ఈ వస్తువుల్లో ఏ ఒక్కటి చూసినా.. రోజులో ఏ పని విజయవంతం కాదు..
ABN , Publish Date - Feb 03 , 2025 | 01:11 PM
నిద్ర లేచిన వెంటనే మనం ఏం చేస్తున్నాం అనేదే ఆ రోజు మొత్తం చేసే పనులను డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఉదయం లేవగానే ఈ వస్తువుల్లో ఏ ఒక్కటీ పొరపాటున కూడా చూడకండి. అలా చేస్తే ఆ రోజు ఏ పని చేసినా విజయవంతం కాదు..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక గురువులు, ఆరోగ్య నిపుణులు, లైఫ్ కోచ్ కోచ్‌లు ఎప్పుడూ ఇదే మాట మాట చెప్తుంటారు. మీ దినచర్యని సానుకూల దృక్పథంతో, ప్రశాంతమైన మనస్సుతో మొదలుపెట్టండి. అప్పుడే ఆ రోజులో ఏ పనైనా విజయవంతంగా చేయగలరు అని. రోజంతా ఆహ్లాదంగా, ఉత్సాహంగా గడవాలంటే ఉదయం నిద్రలేవగానే ఈ చిట్కాలు పాటించండి. పొరపాటున కూడా నిద్ర నుంచి మేల్కొన్న వెంటనే కింద చెప్పిన పనులు అస్సలు చేయకండి. అలా చేస్తే ఆ రోజంతా మీరు వైఫల్యాలు, ఒత్తిడి, నష్టాలు ఎదుర్కొవాల్సి రావచ్చు.
ఉదయాన్నేఈ అలవాట్లు మానుకోండి
అద్దంలో చూడకండి : నిద్ర లేచిన వెంటనే అద్దంలో చూసుకోవటం మంచిది కాదని దాదాపు అన్ని మతాలవారూ నమ్ముతారు. ఉదయాన్నే అద్దంలో చూసుకుంటే మనలో నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. కాబట్టి, కొన్ని ముఖం కడుక్కున్న తర్వాత లేదా తేలికపాటి వ్యాయామం చేశాక అద్దంలో మీ ప్రతిబింబం చూసుకోవడం బెటర్.
వన్యప్రాణుల ఫోటోలు : ఉదయం పూట అడవి జంతువుల చిత్రాలను చూడటం వలన భయం, ఆందోళన, దూకుడు భావాలు కలుగుతాయి. బదులుగా ప్రశాంతమైన, మనసును ఉత్తేజపరిచే విజువల్స్‌తో మీ రోజును ప్రారంభించండి.
మురికి వంటగదిలోకి ప్రవేశించవద్దు : చిందరవందరగా, మురికిగా ఉన్న వంటగదిలోకి నిద్రలేచిన వెంటనే వెళ్లకండి. మీ దినచర్యను ఇలా ప్రారంభించడం వలన ప్రతికూల మైండ్ సెట్ ఏర్పడవచ్చు. రోజంతా సానుకూలంగా భావాలతో ముందుకెళ్లేందుకు వంటగదిని రాత్రే శుభ్రం చేసుకునేందుకు ప్రయత్నించండి. అలాగే చీపురు, డస్ట్‌బిన్ వైపు కూడా దూరంగా బెడ్ రూంకి దూరంగా ఉంచుకోండి.
ఉదయం దినచర్య చిట్కాలు :
ఒక గ్లాసు నీరు త్రాగండి : మీ జీవక్రియ సజావుగా ఉండటానికి, శరీరాన్ని రిఫ్రెష్ చేయడానికి నిద్రలేవగానే ఒక గ్లాసు నీటిని తాగడం అలవాటు చేసుకోండి. మిమ్మల్ని మీరు హైడ్రేట్ చేసుకుంటే ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతారు.
యోగా లేదా వ్యాయామం : యోగా ప్రాక్టీస్ లేదా తేలికపాటి వ్యాయామాలు రక్తప్రసరణ పెంచుతాయి. తద్వారా మానసికంగా, శారీరకంగా శక్తి సామర్థ్యాలు పుంజుకుని రోజంతా ఉల్లాసంగా ఉంటారు.
సానుకూల ధృక్పథం : ప్రశాంతమైన సంగీతం వినడం, ఏకాగ్రతతో ఏదైనా మంత్రాన్ని జపించడం వంటి పనులు దినచర్యలో భాగం చేసుకుంటే మీలో సానుకూల దృక్పథం పెరుగుతుంది.
ప్రకృతిలో గడపండి : నిద్ర మేల్కున్న వెంటనే కిటికీలోంచి ప్రకృతిని గమనించడం, తోటలో లేదా మొక్కల మధ్య కాసేపు నడవడం, బాల్కనీలో కూర్చుని సహజ వాతావరణంతో కొద్ది నిమిషాలు మమేకమయ్యేందుకు ప్రయత్నించండి.