Share News

Heat Waves: ఇక రెడీ అవ్వండి.. లేదంటే దబిడి దిబిడే..

ABN , Publish Date - Apr 01 , 2025 | 01:14 PM

మార్చి నెలలో ఆడపాతడపా తన ప్రతాపాన్ని చూపించిన సూరీడు ఇక ఈనెల ఏప్రిల్ నుండి జూన్ వరకు తన ప్రచండ రూపాన్ని చూపించబోతున్నాడు.

Heat Waves: ఇక రెడీ అవ్వండి.. లేదంటే దబిడి దిబిడే..
summer

Summer: వేసవికాలం కావడంతో ఏప్రిల్ నుండి జూన్ వరకు భారతదేశ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే భారీగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా మధ్య, తూర్పు, వాయువ్య ప్రాంతాలలో వేడి గాలులు రోజురోజుకూ భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) తెలిపింది. ముఖ్యంగా వాయువ్య భారతదేశంలో రెట్టింపు వడగాలులు ఉండవచ్చని హెచ్చరించింది. పశ్చిమ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు సాధారణంగా ఉండవచ్చు. చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.

తీవ్రమైన వేడికి గురయ్యే రాష్ట్రాలు, ఎక్కువ వడగాలులు నమోదయ్యే రాష్ట్రాల జాబితాలో రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇంకా తమిళనాడు ఉత్తర ప్రాంతాలు ఉన్నాయి. కాగా, వేసవి నేపథ్యంలో గరిష్ట విద్యుత్ వినియోగం ఈ వేసవిలో 9 నుండి 10 శాతం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. గతేడాది దేశంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ మే 30న 250 గిగావాట్లకు (GW) చేరుకుంది. ఇది అంచనాల కంటే 6.3 శాతం ఎక్కువ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడగాల్పు తగులకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 01 , 2025 | 01:34 PM