Feeling Sleepy All Day: రోజంతా నిద్ర మత్తు వదలట్లేదా.. ఈ అనారోగ్యాలు కారణం కావొచ్చు
ABN , Publish Date - Apr 14 , 2025 | 11:43 PM
రోజంతా నిద్రమత్తుగా నీరసంగా అనిపిస్తోందంటే కొన్ని అనారోగ్యాలు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: రాత్రంతా నిద్రపోయినా కూడా కొందరికి పగటి పూట నిద్ర మత్తు వదలదు. రోజంతా నిద్రమత్తుగా ఉండి ఇబ్బంది పడుతుంటారు. పనిలో ఉత్సాహం చూపలేక వెనకబడతారు. ఇలాంటి వారిని అలసట కూడా వేధిస్తుంటుంది. అయితే, దీనికి కొన్ని అనారోగ్యాలు కారణమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడి ఎక్కువైనప్పుడు కూడా ఇలాంటి సమస్య వస్తుంది. ఒత్తిడి సమయాల్లో శరీరం కార్టిసాల్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. దీంతో, అప్రమత్తత ఎక్కువవుతుంది. దీని వల్ల నిద్రవేళల్లో మార్పులు వస్తాయి. ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర వస్తుంది.
ఐరన్ లోపం కూడా ఈ సమస్యకు ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ఆక్సీజర్ సరఫరాకు ఐరన్ ఎంతో అవసరం. ఆక్సీజన్ సరఫరా తగినంత ఉంటే కండరాలు, కణజాలం సమర్థవంతంగా పనిచేస్తుంది. ఐరన్ తగ్గినప్పుడు ఒంట్లో నీరసం ఆవహిస్తుంది. దీంతో, రాత్రంతా నిద్రపోయినా మళ్లీ ఉదయాన్నే అలసట నిద్రమత్తు వేధిస్తాయి.
కొందరు తమకు తెలీకుండానే నిద్ర సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. స్లీప్ యాప్నియా ఉన్న వారు నిద్ర సమయాల్లో కొన్ని క్షణాల పాటు ఊపిరి తీసుకోవడం ఆపేస్తారు. దీంతో, మెళకువ వస్తుంది. ఇలా పలు మార్లు జరగడం వల్ల గాఢ నిద్ర పట్టక అలసట తీరదు. మరుసటి రోజంతా నిద్ర వేధిస్తుంది. కొందరిని ఇన్‌సోమ్నియా అనే నిద్రపట్టని సమస్య ఉంటుంది. ఇలాంటి వారు కూడా నిత్యం అలసట, నిద్రమత్తుతో ఇబ్బంది పడుతుంటారు.
రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ ఉన్నవారు నిద్దట్లో అకస్మాత్తుగా కాలు కదుపుతారు. దీంతో, నిద్ర చెదిరిపోతుంది. ఇలా పలుమార్లు జరిగే రాత్రి నిద్ర సరిపోక మరుసటి రోజు పగలంతా నీరసంగా నిద్రమత్తుగా ఉంటుంది.
బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా నిద్రలేమికి దారి తీస్తాయి. ముఖ్యంగా లైమ్ డిసీజ్ వంటి వ్యాధుల కారణంగా రోగులు దీర్ఘకాలిక నిరసంతో ఇబ్బంది పడతారు. ఈ నీరసం కొన్ని నెలల నుంచి ఏళ్ల పాటు కొనసాగుతుందని జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్‌లో ప్రచురితమైంది. మోనోన్యూక్లియోసిస్, క్రానిక్ ఫ్యాటిగ్ సిండ్రోమ్ వంటివి కూడా పగలంతా నిద్రమత్తు వదలనీయకుండా చేస్తాయి.
జీవక్రియలను నియంత్రించే థైరాయిడ్ గ్రింధిలో సమస్యలు కూడా శక్తి హీనత కలుగ జేసి పగతంతా నిద్రమత్తు వేధించేలా చేస్తాయి. బ్లడ్ టెస్టుల్లో ఈ సమస్య ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చు. హార్మోన్ థెరపీ ద్వారా పూర్తి ఆరోగ్యాన్ని పొందొచ్చు.
ఇవి కూడా చదవండి:
కిడ్నీ సమస్యలున్న వాళ్లు టమాటాలు ఎందుకు తినొద్దంటే..
మధ్యాహ్నం నిద్రతో ఆరోగ్యానికి చేటు కలుగుతుందా?
జుట్టు ఆరోగ్యం కోసం ఈ విటమిన్స్ తప్పనిసరి!