Share News

Health Tips : ప్రెగ్నెన్సీ టైంలో మిల్లెట్స్ తింటున్నారా.. నిపుణుల సలహా ఇదే..

ABN , Publish Date - Jan 20 , 2025 | 06:26 PM

ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయిన క్షణం నుంచి ఏది తినాలి.. ఏం తాగాలి.. అనే విషయంలో రకరకాల సందేహాలు తలెత్తుతాయి మహిళల్లో. సాధారణంగా తృణధాన్యాలు అంటే మిల్లెట్లతో చేసిన పదార్థాలు తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని సూచిస్తుంటారు పోషకాహార నిపుణులు. మరి, ప్రెగ్నెసీ సమయంలో మిల్లెట్లు తినటం మంచిదేనా? తింటే ఏమవుతుంది? ఈ విషయమై నిపుణులు ఏమని సలహా ఇస్తున్నారు?

Health Tips : ప్రెగ్నెన్సీ టైంలో మిల్లెట్స్ తింటున్నారా.. నిపుణుల సలహా ఇదే..
Millets During Pregnancy Experts Tips

గర్భధారణ సమయంలో ప్రతి మహిళా ఆరోగ్యంపై ప్రత్యేక వహించాలి. ఈ సమయంలో తినే ఆహారం, జీవనశైలి, నిద్ర ప్రతిదీ పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతాయి. బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉండేందుకు సాధారణంగా కంటే అధిక మోతాదులో పోషకాహారం తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు తక్కువగా తీసుకోవాలి లేకపోతే మానేయాలి అని సూచిస్తుంటారు ఇంట్లో పెద్దవాళ్లు. మందులు ఉపయోగించే విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని పదే పదే హెచ్చరిస్తుంటారు. అందుకే, ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయిన క్షణం నుంచి ఏది తినాలి.. ఏం తాగాలి.. అనే విషయంలో రకరకాల సందేహాలు తలెత్తుతాయి మహిళల్లో. సాధారణంగా తృణధాన్యాలు అంటే మిల్లెట్లతో చేసిన రోటీ తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని సూచిస్తుంటారు పోషకాహార నిపుణులు. మరి, ప్రెగ్నెసీ సమయంలో మిల్లెట్లు తినటం మంచిదేనా? తింటే ఏమవుతుంది? ఈ విషయమై నిపుణులు ఏమని సలహా ఇస్తున్నారు?


గర్భిణీలు తమతో పాటు కడుపులో ఉన్న బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలి. గర్భధారణ మొత్తం సమయంలో కొత్త జీవనశైలికి అలవాటు పడటం మహిళలకు సవాలే. అటువంటి పరిస్థితిలో గర్భిణీ స్త్రీలు మిల్లెట్ రోటీని తినవచ్చా అనే ప్రశ్న తలెత్తుతుంది.


మిల్లెట్ రోటీ తింటే..

మిల్లెట్‌లో విటమిన్ బి, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు లభిస్తాయి. కాబట్టి, గర్భధారణ సమయంలో మిల్లెట్ రోటీని తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. అయితే, పరిమిత పరిమాణంలోనే తీసుకోవాలని లేకపోతే వేడిచేసే అవకాశముందని సూచిస్తున్నారు.


ప్రెగ్నెన్సీ సమయంలో మిల్లెట్ రోటీ తింటే కలిగే ప్రయోజనాలివే..

రక్తం కొరత

మిల్లెట్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో దీన్ని తినడం వల్ల రక్తహీనత దూరమవుతుంది. హిమోగ్లోబిన్ లోపం ఏర్పడకుండా చేసి బిడ్డ ఆరోగ్యవంతంగా పుట్టేందుకు సహాయపడుతుంది.

మలబద్ధకాన్ని నివారిస్తుంది

సజ్జలతో చేసిన రోటీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది గర్భధారణ సమయంలో మలబద్ధకం నుంచి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. జీర్ణక్రియ సంబంధించిన సమస్యల నివారిస్తుంది. ఇందులోని ప్రోబయోటిక్స్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.


శరీరం శక్తిని పొందుతుంది

గర్భధారణ సమయంలో స్త్రీలలో అలసట, బలహీనత, నీరసం తరచుగా కనిపిస్తాయి. మిల్లెట్ రోటీలో కూడా కార్బోహైడ్రేట్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల శరీరానికి అవసరమైనంత శక్తి అందుతుంది.

అయితే, అనారోగ్య సమస్యలు ఉన్న మహిళలు గర్భధారణ సమయంలో మిల్లెట్ బ్రెడ్, తృణధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు తీసుకునే ముందు వైద్యులను సంప్రదించాలని నిపుణులు అంటున్నారు.

Updated Date - Jan 20 , 2025 | 06:26 PM