Share News

Summer Skincare: మండే ఎండల్లో తాజా చర్మం కావాలా.. ఈ సింపుల్స్ టిప్స్‌తో మెరిసిపోవడం ఖాయం..

ABN , Publish Date - Mar 31 , 2025 | 07:37 PM

Summer Skincare Secrets: వేసవికాలం వచ్చేసింది. ఎండ తీవ్రత పెరిగేకొద్దీ ఉక్కపోతకు ముఖంపై తేమ పెరిగిపోతుంది. చెమట కారడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి పగుళ్లు ఏర్పడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో చర్మ సంరక్షణ కోసం ఈ ప్రత్యేక చిట్కాలు, ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యం.

Summer Skincare: మండే ఎండల్లో తాజా చర్మం కావాలా.. ఈ సింపుల్స్ టిప్స్‌తో మెరిసిపోవడం ఖాయం..
summer skincare tricks

Summer Skincare Secrets: చర్మం అందానికి ఒక్కటే కాదు. ఆరోగ్యానికి కూడా ప్రతిరూపం. ఇతర కాలాలతో పోలిస్తే ఎండకాలం సూర్యకిరణాల నుంచి అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు నేరుగా మన ముఖాన్ని తాకుతాయి. ఈ కారణంగా చర్మం కమిలిపోవడం, త్వరగా నల్లబడటం, ముడుతల పడి అందవిహీనంగా అయిపోవడం జరుగుతుంది. దుమ్ము, ధూళి, కాలుష్యానికి ఎండ కూడా తోడైతే చర్మానికి మరింత హానికరం. ఇలాంటి సమయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోకుండా బయట తిరిగితే క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలకు కారణం కావచ్చు. మండే వేసవిలోనూ తాజాగా మెరిసిపోయే చర్మం మీ సొంతం కావాలంటే సరైన టిప్స్, ఆహారపు అలవాట్లు అనుసరించడం అవసరం.


వేసవి కాలంలో ప్రతిరోజూ 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. వాతావరణంలో పెరిగిన తేమ వల్ల చెమట రంధ్రాలు మూసుకుపోయి చర్మ జిడ్డుగా మారుతుంది. దీనికి బ్యాక్టీరియా, ధూళి జత అయితే మొటిమలు, చెమటకాయలు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే ఈ కింది స్కిన్ కేర్ టిప్స్ పాటించండి.

1. ఫేస్ వాష్

ముఖాన్ని కడుక్కోవడం అవసరమే. కానీ అధికంగా శుభ్రపరచడం వల్ల చర్మంలోని సహజ తేమ తగ్గిపోతుంది. దీనివల్ల ముఖంపై పగుళ్లు ఏర్పడి చికాకు తెప్పిస్తాయి. అందుకే రోజుకు రెండుసార్లు తేలికపాటి, సల్ఫేట్ లేని క్లెన్సర్‌ను ఉపయోగించండి. ఉదయం ఒకసారి, పడుకునే ముందు ఒకసారి చేస్తే చాలు. మీకు పగటిపూట ఎక్కువగా చెమట పట్టే అవకాశం ఉంటే ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోండి. స్క్రబ్ చేయకండి. మొటిమల చర్మం ఉన్నవారు పగుళ్లు రాకుండా ఉండేందుకు సాలిసిలిక్ యాసిడ్ లేదా టీ ట్రీ ఆయిల్ కలిపిన క్లెన్సర్‌లను వాడాలి.


2. మాయిశ్చరైజర్

జిడ్డు చర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్ అవసరం లేదని చాలామంది అనుకుంటారు. దానిని వాడకపోతే మరింత నూనె ఉత్పత్తి అవుతుందని తెలీదు. చర్మరంధ్రాలు మూసుకుపోకుండా హైడ్రేటెడ్‌గా ఉండాలంటే కలబంద లేదా హైలురానిక్ ఆమ్లం వంటి పదార్థాలతో తయారైన నూనె లేని మాయిశ్చరైజర్‌ను ఎంచుకోండి. ఇది చర్మంపై అదనపు జిడ్డును నివారించి తాజాగా మారుస్తాయి.

3. సన్‌స్క్రీన్‌

మీది ఆయిల్ స్కిన్ అయితే SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న జెల్ ఆధారిత నూనె లేని సన్‌స్క్రీన్‌ను ఎంచుకోండి. నియాసినమైడ్, జింక్ ఆక్సైడ్ వంటి పదార్థాలు మొటిమల మంటల నివారించడంతో పాటు హానికరమైన UV కిరణాల నుండి రక్షిస్తాయి.

4. చెమట

మీ చర్మంపై ఎక్కువసేపు చెమట నిలిచి ఉండటం వల్ల మొటిమలు వస్తాయి. శారీరక శ్రమ తర్వాత ముఖాన్ని గట్టిగా రుద్దకుండా శుభ్రమైన టవల్ లేదా బ్లాటింగ్ పేపర్‌తో సున్నితంగా తుడవండి. చెమట పట్టిన దుస్తులను వెంటనే మార్చుకోండి. శరీరంపై చెమటకాయలు రాకుండా యాంటీ బాక్టీరియల్ బాడీ వాష్ ఉపయోగించి స్నానం చేయండి.


5. భారీ మేకప్

వేడి వాతావరణంలో దట్టంగా మేకప్ వేసుకుంటే చెమట రంధ్రాలు మూసుకుపోతాయి. బదులుగా సహజమైన లుక్ కోసం మినరల్స్ బేస్డ్ పౌడర్లు లేదా BB క్రీమ్‌లు ఎంచుకోండి. నిద్రపోయే ముందు ఎల్లప్పుడూ మేకప్ తొలగించడం మర్చిపోకండి.

6. ఎక్స్‌ఫోలియేట్

చెమటపై మృత చర్మ కణాలు అధికంగా పేరుకుపోతాయి. అందుకే వారానికి రెండు లేదా మూడు సార్లు సున్నితమైన స్క్రబ్ లేదా లాక్టిక్ యాసిడ్ లేదా సాలిసిలిక్ యాసిడ్ వంటి పదార్థాలను కలిగి ఉన్న తేలికపాటి ఎక్స్‌ఫోలియంట్‌ని ఉపయోగించి మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయండి. ఇది చర్మాన్ని చికాకు పెట్టకుండా మీ రంధ్రాలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.


మీరు తినే ఆహారం మీ చర్మ ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా వేసవిలో. సరైన ఆహారాలు మీ చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి, ముడతలు పడకుండా నిరోధించడానికి, ఎండ వల్ల దెబ్బతినకుండా రక్షించడానికి సహాయపడతాయి. మెరిసే చర్మం కోసం తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..

  • పుచ్చకాయ: పుచ్చకాయలో నీటి శాతం అధికం. ఇది మీ చర్మాన్ని హైడ్రేటెడ్‌గా, తాజాగా ఉంచుతుంది. అదే సమయంలో సూర్యకిరణాల నుంచి రక్షించుకునేందుకు కావలసిన విటమిన్ A, C లను అందిస్తుంది.

  • దోసకాయ: దోసకాయ చర్మాన్ని చల్లబరుస్తుంది. దీనిలోని సిలికా కంటెంట్ ఉబ్బును తగ్గించి తాజాగా ఉంచేలా చూస్తుంది.


  • టమోటాలు: టమోటాలలో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఈ సహజ యాంటీఆక్సిడెంట్ మీ చర్మాన్ని సూర్యరశ్మి నుంచి దెబ్బతినకుండానే కాదు. అకాల వృద్ధాప్యం నుంచి కూడా కాపాడుతుంది.

  • పెరుగు: పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగుకు, చర్మానికి దగ్గరి సంబంధం ఉంటుంది. ఇందులోని శీతలీకరణ లక్షణాలు వేగంగా సూర్యరశ్మికి గురైన చర్మానికి ఉపశమనం కలిగిస్తాయి.

  • బెర్రీలు: స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్ బెర్రీస్ బెర్రీలు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తాయి. బిగుతైన చర్మం కోసం అవసరమైన కొల్లాజెన్‌ పెరిగేందుకు సహకరిస్తాయి.


Read Also: Green Chillies: ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా..

Summer Tips: వేసవిలో రోజుకు ఎంత నీరు తాగాలి.. తక్కువ తీసుకుంటే ఏ సమస్యలు వస్తాయి..

Headache relief: టీ లేదా కాఫీ తాగితే నిజంగా తలనొప్పి తగ్గిపోతుందా.. ప్రతిసారీ ఇదే అలవాటు కొనసాగిస్తే..

Updated Date - Mar 31 , 2025 | 07:40 PM