Share News

Skin Care: తమలపాకుతో గ్లోయింగ్ స్కిన్.. ఈ 3 చర్మ సమస్యలు కూడా పోతాయ్..

ABN , Publish Date - Apr 01 , 2025 | 05:03 PM

Natural skincare with betel leaves: తమలపాకు కేవలం కిళ్లీలాగో, పండగలు, పేరంటాలప్పుడు తాంబూలంగా మాత్రమే పనికొస్తుదనుకుంటే పొరపాటు. ఇందులో ఎన్నో ఆయుర్వేదిక గుణాలున్నాయి. ముఖ్యంగా చర్మసంరక్షణకు తమలపాకు చాలా మంచిదని మీకు తెలుసా..

Skin Care: తమలపాకుతో గ్లోయింగ్ స్కిన్.. ఈ 3 చర్మ సమస్యలు కూడా పోతాయ్..
Betel leaves skincare benefits

Betel leaf health and beauty benefits: కాలానికి తగినట్టు చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే చర్మం ప్రకాశవంతంగా, తాజాగా కనిపిస్తుంది. కానీ, కొన్నిసార్లు తెలియకుండా ఏదైనా క్రీం చర్మానికి పూసుకున్నప్పుడు ముఖం జీవం కోల్పోయినట్లుగా అయిపోతుంది. చాలాసార్లు చర్మ రంగులో కూడా మార్పురావచ్చు. దీని ప్రభావంతో మచ్చలు, మొటిమలు సమస్యలు రావచ్చు. ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైనప్పుడు తమలపాకును ఉపయోగిస్తే పరిష్కారం దక్కవచ్చు. వీటిని రోజూ వాడితే ఎలాంటి క్రీములు అవసరం లేదని, ముడతల సమస్య కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి, దీనిని ఎలా వాడితే గ్లోయింగ్ ఫేస్ మీ సొంతమవుతుందో తెలుసుకోండి..


తమలపాకు ప్రయోజనాలు

తమలపాకుల్లో చర్మానికి మేలు చేసే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మంలోని వేడిని లాగేస్తుంది. మీరు దీనిని వివిధ మార్గాల్లో ముఖంపై అప్లై చేసుకుంటే అనేక చర్మ సమస్యలు తొలగిపోతాయి.


1. మొటిమలు

ముఖం మీద మురికి, జిగట, హార్మోన్లలో తేడాల కారణంగా మొటిమల సమస్య వస్తుంది. అలాగే మారుతున్న జీవనశైలి వల్ల కూడా ఇవి రావచ్చు. ఈ సమస్యను తగ్గించుకోలేక చాలామంది రకరకాల చిట్కాలు ప్రయత్నిస్తుంటారు. తమలపాకులో మొటిమల సమస్యను నివారించే అద్భుత ఔషధ గుణాలున్నాయని చాలామందికి తెలియదు. మీరు గనక ఇలా చేస్తే మొటిమల సమస్య పూర్తిగా మటుమాయం అయిపోతుంది. ముందుగా మీరు తమలపాకులను నీటితో శుభ్రం చేయండి. తరువాత వీటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ పేస్ట్‌లో నీటిని పూర్తిగా వడకట్టి కాటన్ ప్యాడ్‌తో మీ ముఖంపై అప్లై చేయండి. దీన్ని పూసుకోవడం వల్ల మొటిమల చికాకు తగ్గి చర్మం శుభ్రంగా కనిపిస్తుంది.


2. నల్లటి మచ్చలు

ముఖం మీద మొటిమలు పోయిన తర్వాత నల్లటి మచ్చలు ఏర్పడుతుటాయి. ఇవి మీ ముఖం అందాన్ని తగ్గిస్తాయి. అందుకని వివిధ రకాల క్రీములు ప్రయత్నిస్తుంటారు. ఇంత కష్టపడే బదులు తేనెతో కలిపి తమలపాకు పేస్ట్ రాసుకోండి. ఈ సమస్య ఇట్టే తగ్గిపోతుంది. ఆ తర్వాత మీరు మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములను పూసుకోవాల్సిన అవసరం లేదు. తమలపాకు మీ ముఖాన్ని కచ్చితంగా మెరిసిపోయేలా చేస్తుంది. కావాలంటే మీరు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసి ఈ టిప్ ప్రయత్నించి చూడండి.


3. గ్లోయింగ్ స్కిన్

తమలపాకుకు ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చగలిగే ఎన్నో గుణాలున్నాయి. ఇది మీ ముఖం మెరుపును రెట్టింపు చేస్తుంది. అలా జరగాలంటే, ముందుగా మీరు తమలపాకును మెత్తని పేస్ట్ చేయాలి. తరువాత ఈ మిశ్రమంలో ఉన్న నీటిని ఫిల్టర్ చేసి శనగపిండిలో కలపండి. కొద్దిగా పసుపు కూడా కలిపి పేస్ట్ లా చేసి ఫేస్ ప్యాక్ లాగా ముఖానికి అప్లై చేసుకోండి. 10-15 నిమిషాలు అలాగే ఉంచుకుని నీటితో శుభ్రపరచుకుంటే ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. ఇలాగే తరచూ చేస్తే సమస్య పూర్తిగా తొలగిపోతుంది.


Read Also: Kitchen Hacks: మీరు కొంటున్న కందిపప్పు నిజమైనదా లేదా నకిలీదా.. తెలుసుకునేందుకు కొన్ని చిట్కాలు..

Heat relief solutions: సమ్మర్‌లో శరీర వేడి తగ్గేందుకు కొన్ని చిట్కాలు..

Coriander Leaves: కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి..

Updated Date - Apr 01 , 2025 | 05:05 PM