China Strong Winds: చైనాపై విరుచుపడిన పెనుగాలులు.. 50 కిలోల కంటే బరువు తక్కువుంటే గాల్లోకే
ABN , Publish Date - Apr 12 , 2025 | 07:56 PM
బీజింగ్‌లో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా గంటకు 93 కిలోమీటర్ల పెనువేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో పర్యాటక ప్రాంతాలను మూసివేశారు.

బీజింగ్: ఉత్తర చైనా, రాజధాని నగరం బీజింగ్‌లో పెనుగాలులు విరుచుకుపడటంతో వందలాది విమానాలు, రైలు సర్వీసులను రద్దయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 11.30 గంటలకు బీజింగ్‌లోని రెండు ప్రధాన విమానాశ్రయాల్లో 838 విమాన సర్వీసులు రద్దయినట్టు 'రాయిటర్స్' వార్తా సంస్థ తెలిపింది.
Plane Crash: న్యూయార్క్ తర్వాత మరో విమాన ప్రమాదం..ముగ్గురు మృతి, ఒకరికి గాయాలు
బీజింగ్‌లో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా గంటకు 93 కిలోమీటర్ల పెనువేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. 50 కిలోల బరువు కంటే తక్కువ ఉన్నవారు గాలిలోకి ఎగిరిపోయే ప్రమాదం ఉందని కొన్ని మీడియా సంస్థలు హెచ్చరించడంతో లక్షలాది మంది పౌరులు ఇళ్లకే పరిమితమయ్యారు. వీధులన్నీ నిర్మానుష్యమయ్యాయి. ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ సబ్‌వై లైన్ సహా రైళ్ల సర్వీసులు, హైస్పీడ్ రైల్ లైన్ సర్వీసులను రద్దు చేశారు. పార్కులు మూసివేశారు. బిజింగ్ నగరంలో దాదాపు 300 చెట్లు నేలకూలాయి. పలు వాహనాలు దెబ్బతిన్నాయి.
కాగా, అత్యంత బలమైన గాలుపు వీచే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటూ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. ఈ తరహా అలెర్ట్ ప్రకటించడం ఈ దశాబ్దంలో ఇదే మొదటిసారి. పెనుగాలుల స్పీడును 1 నుంచి 17 వరకూ చైనా వాతావరణ శాఖ లెక్కగడుతుంది. 11వ లెవెల్ పెనుగాలుల వల్ల తీవ్రమైన నష్టం ఉంటుంది. 12వ లెవల్ గాలులతో తీవ్ర విధ్వంసం జరుగుతుంది. ఈ వారాంతంలో గాలుపు 11 నుంచి 13వ లెవెల్ వరకూ ఉంచొచ్చని వాతావరణ అంచనా వేసింది. అయితే శనివారంనాటి పెనుగాలుల తీవ్రత ఆదివారానికి తగ్గవచ్చని తెలిపింది.
ఇవి కూాడా చదవండి..