Fire Accident: ఆస్ట్రేలియాలో భారీ అగ్నిప్రమాదం.. హోటల్ గదిలో మంటలు చెలరేగడంతో..

ABN, Publish Date - Mar 17 , 2025 | 12:28 PM

ఆస్ట్రేలియాలోని హోట‌ల్‌లో మంటలు చెలరేగాయి. దీంతో హోటల్లో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. లోపల ఉన్న వారంతా భయంతో పరుగులు తీశారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు 400 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు..

Fire Accident: ఆస్ట్రేలియాలో భారీ అగ్నిప్రమాదం.. హోటల్ గదిలో మంటలు చెలరేగడంతో..

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌ అగ్నిప్రమాదం ఘటన ఎంత బీభత్సం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే తాజాగా ఆస్ట్రేలియాలో సంభవించిన అగ్నిప్రమాదం అందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. పెద్ద హోటల్‌లో మంటలు చెలరేగడంతో సుమారు 400 మందికి పైగా జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


ఆస్ట్రేలియా (Australia) క్వీన్స్‌ల్యాండ్ పరిధిలోని హిల్టన్ హోట‌ల్‌లో శుక్రవారం వేకువజాము 2 గంటల ప్రాంతంలో (Fire Accident) మంటలు చెలరేగాయి. దీంతో హోటల్లో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. లోపల ఉన్న వారంతా భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని, చాలా సేపు శ్రమించి మంటలను ఆర్పేశారు. హోటల్ భవనం పై అంతస్తు నుంచి మంటలు వ్యాపించినట్లు తెలిసింది. చూస్తుండగానే మంటలు మిగతా అంతస్తులకు వ్యాపించాయి.


నిప్పు రవ్వలు భవనం పైనుంచి పడుతుండంతో చుట్టు పక్కల వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే సమయానికి అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంటలు వ్యాపించగానే అప్రమత్తమైన సిబ్బంది.. హోటల్లోని సుమారు 400 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. మంటలు ఆర్పిన తర్వాత వారంతా యథావిధిగా వారి వారి గదుల్లోకి వెళ్లిపోయారు. అగ్రిప్రమాద ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన వెనుక ఎవరి హస్తం అయినా ఉందా.. లేదా ప్రమాదవశాత్తు సంభవించిదా... అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Updated Date - Mar 17 , 2025 | 12:28 PM