Fire Tragedy: నైట్ క్లబ్‌లో అగ్నిప్రమాదం..59 మంది దుర్మరణం
ABN , Publish Date - Mar 17 , 2025 | 05:29 AM
మరో 155 మంది గాయపడగా.. వారిలో 118 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఐరోపాలోని నార్త్ మెసిడోనియాలో ఉన్న పల్స్‌క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున 2.25 గంటలకు చోటుచేసుకుంది.

నార్త్ మేసిడోయాలో ఘటన
స్కోప్జే(నార్త్‌మెసిడోనియా), మార్చి 16: నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటనలో 59 మంది దుర్మరణంపాలయ్యారు. మరో 155 మంది గాయపడగా.. వారిలో 118 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఐరోపాలోని నార్త్ మెసిడోనియాలో ఉన్న పల్స్‌క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున 2.25 గంటలకు చోటుచేసుకుంది. బాణసంచా(పిరోటెక్నిక్) వంటి పదార్థం కారణంగా మంటలు వ్యాపించినట్లు ఆ దేశ అధ్యక్షుడు సిల్యనోవాస్క చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు క్లబ్‌లో 1,500 మంది వరకు ఉన్నట్లు వివరించారు. మృతుల్లో 35 మందిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..