Sunita Williams: రేపు ఈపాటికి భూమికి సునీతా విలియమ్స్!
ABN , Publish Date - Mar 18 , 2025 | 04:39 AM
ఆమెతో పాటు సహచర వ్యోమగామి బచ్ విల్మోర్ కూడా రానున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా కాలమానం ప్రకారం సాయంత్రం 5.57 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం వేకువజామున 3.37 గంటలకు) వారు ప్రయాణించే క్యాప్సూల్ ఫ్లోరిడా సమీపంలోని సముద్రంలో దిగనుంది.

వాషింగ్టన్, మార్చి 17: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దాదాపు తొమ్మిది నెలల పాటు చిక్కుకున్న భారతీయ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ బుధవారం తిరిగి భూమి మీదకు రానున్నారు. ఆమెతో పాటు సహచర వ్యోమగామి బచ్ విల్మోర్ కూడా రానున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా కాలమానం ప్రకారం సాయంత్రం 5.57 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం వేకువజామున 3.37 గంటలకు) వారు ప్రయాణించే క్యాప్సూల్ ఫ్లోరిడా సమీపంలోని సముద్రంలో దిగనుంది. అక్కడి నుంచి ఒక్కొక్కరిని బయటకు తీసుకువస్తారు. వారిని తీసుకురావడానికి వెళ్లిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఆదివారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. దీంట్లో వెళ్లిన నలుగురు వ్యోమగాములు అక్కడి బాధ్యతలను స్వీకరించారు. సునీత, విల్మోర్‌లతో పాటు నాసా వ్యోమగామి నిక్ హ్యాగ్, రష్యా వ్యోమగామి అలెక్సాండర్ గర్బొనవ్ కూడా క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో తిరిగి రానున్నారు. వారు కిందకు దిగే కార్యక్రమాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. క్రూ డ్రాగన్ వ్యోమనౌక ప్రయాణ సన్నాహాలు సోమవారం రాత్రే మొదలయ్యాయి.
అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 10.45 గంటలకు వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ మొదలవుతుంది. అర్ధరాత్రి 12.45 గంటలకు అన్‌డాకింగ్ ఆరంభవుతుంది. స్పేస్‌షివ్ విడిపోయిన తరువాత మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. 5.51 గంటలకు భూమి కక్ష్యను దాటుకొని వస్తుంది. సాయంత్రం 5.57 గంటలకు ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగుతుంది. గత ఏడాది జూన్ 5న ప్రయోగించిన స్టార్‌లైనర్ వ్యోమనౌక ద్వారా సునీత, విల్మోర్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఎనిమిది రోజులు ఉండాలన్నది అసలు ప్రణాళిక. అయితే స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారిని తిరిగి తీసుకురాకుండానే భూమికి వచ్చింది. దాంతో వారు ఇంతకాలం అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి...
Nishanth Dongari: ఇంధన నిల్వ విభాగంలో సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కర్ణకు రంగం సిద్ధం
YSR Kadapa District: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు
PM Modi: మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా
CM Revanth Reddy: కేబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనేనా..
Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్
CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Droupadi Murmu: రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు
CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్ రూపొందించాం
Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్