Share News

415 Crore Compensation: నక్కతోక తొక్కాడు.. కాఫీ మీద పడిందని రూ.415 కోట్ల పరిహారం..

ABN , Publish Date - Mar 17 , 2025 | 03:42 PM

వేడి వేడి కాఫీ మీద పడిందన్న కారణంతో ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లాడు. తనకు నష్ట పరిహారం అందించాలని కోరాడు. విచారణ జరిపిన కోర్టు ఆ వ్యక్తికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 415 కోట్లు ఇవ్వమని కంపెనీని ఆదేశించింది.

 415 Crore Compensation: నక్కతోక తొక్కాడు.. కాఫీ మీద పడిందని రూ.415 కోట్ల పరిహారం..
Coffee

చిన్న చిన్న సమస్యలకే కొంతమంది ఢీలా పడిపోతూ ఉంటారు. అయ్యో.. నా జీవితం ఇలా అయిపోయిందేంటి అనుకుంటూ ఉంటారు. దేవుడి సృష్టిలో సుఖ, దు:ఖాలు, కష్ట, నష్టాలు శాశ్వతం కాదని గుర్తించరు. ఇదంతా నేనెందుకు చెబుతున్నానంటే.. కొన్నేళ్ల క్రితం ఓ డెలివరీ బాయ్ మీద వేడి, వేడి కాఫీ పడింది. కాఫీ కారణంగా చర్మం బాగా కాలిపోయింది. ఆ గాయం కారణంగా అతడు చాలా నష్టపోయాడు. మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు. అలాగని అతడు మౌనంగా ఉండిపోలేదు. తన కష్టాలకు కారణమైన కంపెనీ మీద కేసు వేశాడు. నాలుగు ఏళ్లు పోరాటం చేశాడు. అతడు చేసిన పోరాటం ఫలించింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఏకంగా 415 కోట్ల రూపాయలు అతడి సొంతం అయ్యాయి. ఈ సంఘటన అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన మైఖల్ గార్సియా డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు.


2020 సంవత్సరంలో అతడికి ఓ ఆర్డర్ వచ్చింది. మైఖల్ ఆ ఆర్డర్‌ను తీసుకోవడానికి స్టార్‌బక్స్ షాపు దగ్గరకు వచ్చాడు. ఓ కంటైనర్‌లో మూడు వేడి వేడి కాఫీ కప్పులు ఉన్నాయి. షాపు సిబ్బంది కంటైనర్‌ను మైఖల్ చేతికి అందించాడు. అయితే, కంటైనర్‌ మూత సరిగా మూయకపోవటంతో .. మూడు కప్పుల్లోని ఒకటి కిందకు జారింది. అందులోని వేడి వేడి కాఫీ మైఖల్ పొట్టతో పాటు పొట్టకింది భాగంలో పడింది. వేడి కాఫీ కారణంగా పొట్ట చర్మంతో పాటు పొట్ట కింది భాగంలోని అవయవం కూడా బాగా కాలిపోయింది. నరాలు కొంత దెబ్బతిన్నాయి. ఆ ప్రమాదం కారణంగా అతడి జీవితమే మారిపోయింది. పెను మార్పులు వచ్చాయి. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కూడా చాలా దెబ్బ తిన్నాడు. అలాగని, మైఖల్ బాధపడుతూ కూర్చోలేదు. తాను ఇలా అన్ని రకాలుగా నష్టపోవడానికి కారణమైన కంపెనీపై కోర్టుకు వెళ్లాడు. తనకు జరిగిన అన్యాయానికి నష్ట పరిహారం కావాలని కోరాడు.


2020 నుంచి కోర్టులో కేసు నడుస్తోంది. వాదోపవాదాలు విన్న తర్వాత కాలిఫోర్నియా సుపీరియర్ కోర్టు ఓ నిర్ణయానికి వచ్చింది. మైఖల్‌కు అనుకూలంగా తీర్పు నిచ్చింది. అతడికి పరిహారంగా ఏకంగా 415 కోట్లు చెల్లించాలని కోర్టు స్టార్‌బక్స్ కంపెనీని ఆదేశించింది. వేడి కాఫీ మీద పడటం కారణంగా మైఖల్ తన జీవితంలో చాలా నష్టపోయాడని కోర్టు తెలిపింది. అయితే, కాలిఫోర్నియా కోర్టు ఇచ్చిన తీర్పును పై కోర్టులో సవాల్ చేయడానికి స్టార్‌బక్స్ సిద్ధమైంది. అంత పెద్ద మొత్తం పరిహారం ఇవ్వడం సాధ్యపడదని కంపెనీ అంటోంది. ఇక, 1994లో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. స్టెల్లా లీబెక్ అనే మహిళపై కాఫీ పడింది. దీంతో ఆమె మెక్ డొనాల్డ్ కంపెనీకి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసింది. ఆ కేసులో స్టెల్లా గెలిచింది. కోర్టు తీర్పు ప్రకారం ఆమెకు 3 మిలియన్ డాలర్ల పరిహారం దక్కింది.


ఇవి కూడా చదవండి..

PM Modi: భారత శాంతి సందేశం ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తోంది

MK Stalin: ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంపై సీఎం స్టాలిన్ అప్‌డేట్

Shahi Jama Masjid: వివాదాస్పద షాహి జామా మసీదుకు పెయింటింగ్..

Viral Video: ఇది కదా పోలీసుల పవర్.. నడిరోడ్డుపై గూండాలకు చుక్కలు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 17 , 2025 | 07:03 PM