Pakistan Crisis: పాకిస్తాన్ ప్రమాదంలో ఉంది.. జైలు నుంచి ఇమ్రాన్ లేఖ..
ABN , Publish Date - Mar 02 , 2025 | 07:18 PM
Imran Khan Pakistan Crisis: పాకిస్తాన్ రాజకీయ అల్లకల్లోలంలో చిక్కుకుంటోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు గోడల వెనుక నుండి తన గళాన్ని వినిపిస్తూ.. ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న నాటకాన్ని అంతర్జాతీయ సమాజం గమనించాలని కోరుతున్నాడు. ఈ సంక్షోభ సమయంలో ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అమెరికా, పాకిస్తాన్ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చాడు.

Imran Khan Pakistan Crisis: ఇటీవల ఓ పత్రికలో ప్రచురితమైన వ్యాసం ద్వారా ఇమ్రాన్ ఖాన్ గళాన్ని వినిపించే ప్రయత్నం చేశాడు. ఆ వ్యాసంలో పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యానికి ఉరి తాడి బిగుస్తోందని, తనపై మోపిన అభియోగాలు కేవలం ఒక రాజకీయ ఆట అని పేర్కొన్నాడు. తాను ఎదుర్కొంటున్న బాధ వ్యక్తిగతం కాదని.. అది ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి పోరాటం అని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఈ వ్యాసం నిజంగా ఇమ్రాన్ రాశారా? లేదా ఆయన పేరుతో ఎవరో ప్రచురించారా? అనే అనుమానాలపై ఇంకా స్పష్టత లేదు.
ఇమ్రాన్ పీటీఐపై దాడులు..
అటు ఇమ్రాన్ ఖాన్ గళం వినిపిస్తున్నా, అతడి పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ఉగ్రవాద వ్యతిరేక చర్యలను పక్కన పెట్టి PTIపై దాడులు చేయడానికే ఎక్కువ శ్రద్ధ చూపుతోందని ఆయన ఆరోపించాడు. న్యాయవ్యవస్థ, రాజకీయ వ్యవస్థలన్నీ ఒకే దారి పట్టాయని, ఆ విధంగా ప్రజాస్వామ్యం పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉందని ఖాన్ హెచ్చరించారు. అంతేకాదు, రాజకీయ కల్లోలానికి తోడు, పాకిస్తాన్‌లో హింస పెరుగుతోంది. తాజాగా, బలూచిస్తాన్‌లో జామియత్ ఉలేమా-ఇ-ఇస్లాం (JUI) పార్టీకి చెందిన ఇద్దరు ప్రముఖ నాయకులు హత్యకు గురయ్యారు. ఖుజ్దార్ జిల్లాలోని జెహ్రీ ప్రాంతంలో బైక్ పై వచ్చిన దుండగులు వాడేరా గులాం సర్వర్, మౌల్వీ అమానుల్లాపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. వారిద్దరూ అక్కడికక్కడే మరణించగా, హంతకులు ఆ ప్రాంతాన్ని వీడిపోయారు. ఈ భయానక ఘటన వెనుక ఎవరున్నారో తెలియకపోయినా, రాజకీయ ప్రతీకార రాజకీయాలు మరింత ఉద్రిక్తతను పెంచుతున్నాయి.
పాకిస్తాన్‌లో నెలకొన్న గందరగోళ పరిస్థితిని చూస్తే, ఇది కేవలం రాజకీయ కుతంత్రం మాత్రమేనా? లేదా మరింత లోతైన కుట్ర జరుగుతోందా? ఇమ్రాన్ ఖాన్ సంకేతాల వెనుక ఎలాంటి కుట్ర దాగి ఉందో? ప్రపంచం ఈ హింసను అరికట్టేందుకు ముందుకు వస్తుందా? ఈ ప్రశ్నలన్నీ ఇంకా మిస్టరీగానే ఉన్నాయి.
Read Also : Israel: ఇజ్రాయెల్ అమానుష చర్య.. చిన్నారులు తినే ఆహారాన్ని అడ్డుకున్న ఆర్మీ..
Elon Musk : 14వ బిడ్డకు తండ్రి అయిన మస్క్.. ఇంత మంది ఎందుకంటే.. సమాధానమిదే..
Saudi Arabia: సౌదీలో తెలంగాణ ప్రవాసీ హత్య!