Viral Video: హిందీ ప్రేమ పాటతో అదరగొట్టిన పాకిస్తానీ విద్యార్థులు
ABN , Publish Date - Mar 19 , 2025 | 09:04 PM
పాకిస్తాన్ కాలేజీకి చెందిన విద్యార్థులు కొందరు ఓ హిందీ ప్రేమ పాటకు డ్యాన్స్ వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో ఇప్పటి వరకు 9 లక్షలకుపైగా వ్యూస్ తెచ్చుకుంది.

కళకు, ప్రేమకు భాషతో.. ప్రాంతంతో పని లేదు. అందుకే ఇంగ్లీష్ హీరోలను తెలుగు వారు.. తెలుగు హీరోలను జపాన్ వాళ్లు ఇష్టపడుతూ ఉంటారు. ఇక, హిందీ వాళ్లకు పాకిస్తాన్‌లో సూపర్ క్రేజ్ ఉంది. వారి సినిమాలు అక్కడ సూపర్ హిట్లు అవుతుంటాయి. హిందీ సినిమా పాటలు పాకిస్తాన్ వీధుల్లో వినపడుతుంటాయి. తాజాగా, పాకిస్తాన్‌లోని ఓ కాలేజీకి చెందిన స్టూడెంట్స్ ఓ పాత హిందీ ప్రేమ పాటకు అద్భుతంగా డ్యాన్స్ వేశారు. అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. పాకిస్తాన్ లాహోర్‌లోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ యూనివర్శిటీలో యూన్యువల్ యూనివర్శిటీ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా కల్చరల్ ప్రొగ్రామ్ కూడా నిర్వహించారు. ఈ కల్చరల్ ప్రోగ్రామ్‌లో భాగంగా కొందరు కాలేజ్ స్టూడెంట్స్ హిందీలో సూపర్ హిట్ అయిన మొఘల్ ఈ ఆజామ్ సినిమాలోని పాటకు డ్యాన్స్ వేశారు.
ఆ సినిమాలోని ‘ప్యార్ కియాతో డర్‌నా క్యా ’ పాటకు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 9 లక్షలకుపైగా వ్యూస్ తెచ్చుకుంది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ‘ పాకిస్తాన్‌లో ఇండియన్ సినిమా పాటకు డ్యాన్స్.. అద్భుతంగా ఉంది’..‘ ఆహా.. ఆ జంట ఎంత చక్కగా పాత్రల్లో ఇమిడిపోయింది. సినిమాకు ఏ మాత్రం తీసిపోకుండా నటించారు’.. ‘ ఈ వీడియోను చూసిన ప్రతీసారి నాకు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి’ .. ‘ మొఘల్ ఈ ఆజామ్ .. నా ఫేవరేట్ సినిమా’.. ‘ వ్వావ్.. నిజంగా వ్వావ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మొఘల్ ఈ ఆజామ్ సినిమా 1960లో విడుదలై సూపర్ హిట్ అయింది. కే ఆసిఫ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించటంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. పృధ్వీరాజ్ కపూర్, దిలీప్ కుమార్, మధుబాల, దుర్గ కోటే ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా తీయటం కోసం ఆసిఫ్ ఎంతో శ్రమించారు. ఆయన శ్రమకు ఫలితం దక్కింది. 8వ నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో నాలుగు అవార్డులు గెలుచుకుంది. బెస్ట్ సినిమాగా నిలిచింది. తర్వాతి కాలంలో ఈ సినిమాను బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్‌గా మార్చారు. బ్లాక్ అండ్ వైట్ నుంచి డిజిటల్ కలరింగ్ ద్వారా కలర్‌లోకి మార్చబడిన మొదటి హిందీ సినిమాగా కూడా మొఘల్ ఈ ఆజామ్ రికార్డుకెక్కింది. ఈ సినిమాలోని పాటల గురించి అయితే, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ వార్తలు కూడా చదవండి:
సమాధానాలు చెప్పలేక ప్రశ్నోత్తరాలను ఎత్తేస్తారా?
కేసీఆర్‌కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదు
రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంద