Share News

Trump Tariffs: పరుగో పరుగు.. ట్రంప్‌ టారిఫ్‌ బాదుడుతో స్టోర్లకు క్యూ కట్టిన జనం..

ABN , Publish Date - Apr 05 , 2025 | 02:52 PM

Trump Tariffs Effect: టారిఫ్ భయం అమెరికా ప్రజలను బెంబేలెత్తిస్తోంది. షూ, ఫర్నిచర్, కాఫీ, కార్లు, ఇలా నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోతాయనే భయంతో స్టోర్లకు పరుగులు పెడుతున్నారు.

Trump Tariffs: పరుగో పరుగు.. ట్రంప్‌ టారిఫ్‌ బాదుడుతో స్టోర్లకు క్యూ కట్టిన జనం..
Trump Tariffs Effect in America

Trump Tariffs Effect in America: ఇప్పుడు యూఎస్‌లో ఉన్న ప్రతి దుకాణం పగలూ, రాత్రి తేడా లేకుండా జనాలతో కిక్కిరిపోయాయి. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్టోర్లకు క్యూ కడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలపై అధ్యక్షుడు ట్రంప్ భారీగా దిగుమతి పన్నులు విధించడంతో ఆయా వస్తువుల ధరలు అగ్రరాజ్యంలో సామాన్యులు కొనలేనంత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. అందుకే ముందస్తుగా యూఎస్ ప్రజలంతా అన్ని రకాల షాపుల ముందు బారులు తీరుతున్నారు. అవకాడో మొదలుకుని ఆటోమొబైల్స్ వరకూ ప్రతి ఉత్పత్తికి అమెరికా (USA) షాపుల్లో ఇదివరకెన్నడూ లేనంతగా డిమాండ్ పెరిగింది.


ఎలక్ట్రానిక్ వస్తువుల పెరిగిన డిమాండ్..

ట్రంప్ టారిఫ్ దెబ్బకు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురై దుకాణాల వైపు పరుగులు తీస్తున్నారు. అధిక ధరలు జేబులను ఖాళీ చేయకముందే బూట్లు, ఫర్నిచర్, కాఫీ, కార్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, కాఫీ, మసాలా దినుసులు వంటి నిత్యావసర వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ప్రపంచ దేశాలకు పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను సరఫరా చేసే తైవాన్‌పై ట్రంప్‌ 32శాతం పన్నులు విధించడంతో అమెరికాలో వీటి ధరలు అమాంతం పెరగనున్నాయి. అందుకే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలకు యూఎస్ దుకాణాల్లో గిరాకీ పెరిగింది.


వసూలు మొదలైంది..

ఇప్పటికే ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌లు అగ్రరాజ్యంలో అమల్లోకి వచ్చాయి. అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 5 నుంచి టారిఫ్‌ల్లో బేస్‌లైన్‌ 10శాతాన్ని వసూలు చేస్తున్నారు. ఏప్రిల్‌ 10 నుంచి మిగిలిన మొత్తాన్ని విధిస్తారు. ఈ నేపథ్యంలోనే అమెరికా విమానాశ్రయాలు, సీ పోర్టులు, కస్టమ్స్ వేర్‌హౌస్‌ల వద్ద అధికారులు దిగుమతి అయిన ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్నారు.


చివరికి నష్టపోయేది వాళ్లే..

పరస్పర సుంకాలంటూ మిత్ర, శత్రు దేశాలనే తేడా లేకుండా అన్ని దేశాలపై టారిఫ్ వేటు వేశాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ చర్య వల్ల అగ్రరాజ్యం లాభపడే సంగతి అటుంచితే.. చివరికి వినియోగదారులుగా ఉన్న అమెరికన్లే తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని వాణిజ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీకార సుంకాల వల్ల ఇతర దేశాల మధ్య వాణిజ్య సరఫరా గొలుసు తెగిపోయి వ్యాపారుల పెట్టుబడి ఖర్చులు పెరిగి, లాభాల మార్జిన్లు తగ్గుముఖం పట్టడమే ప్రధాన కారణమని చెబుతున్నారు.


Read Also: Trump Tariffs Shake Global Markets: ఫార్మాపైనా సుంకాలు

Kazakhstan: చర్చనీయాంశంగా మారిన కజకిస్తాన్ దేశం.. అక్కడ దొరికింది చూస్తే..

Yoon Suk yeol Impeachment: దక్షిణ కొరియా అధ్యక్షుడిపై వేటు

Updated Date - Apr 05 , 2025 | 02:59 PM