AC Safety Precautions: సమ్మర్‌లో ఏసీ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ABN , Publish Date - Apr 07 , 2025 | 07:42 PM
AC Safety Precautions In Summer: ఎండకాలం రాగానే అందరూ ఎయిర్ కండీషనర్లు ఎడాపెడా వాడేస్తుంటారు. కానీ, దీనికీ ఓ లిమిట్ ఉంటుంది. భగభగలాండే ఎండల వేడికి ఏసీ పేలకుండా సక్రమంగా పనిచేయాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే..

AC Blast Prevent Tips: ఎండలు మొదలయ్యాయంటే చాలు.. ముందుగా గుర్తుకువచ్చేది కూల్.. కూల్.. ఏసీ.. మీ ఇంట్లో కూడా ఏసీ ఉండి, వేసవిలో పగలు, రాత్రి దాన్ని ఉపయోగిస్తుంటే.. మీరు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మరి, ఏసీని ఎలా ఉపయోగించాలి... ఎంత సమయం ఉపయోగించాలి.. ఏ సమయంలో ఉపయోగించాలి.. ఇలాంటి చాలా విషయాలు మనలో చాలా మందికి తెలియవు... అందుకే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం...
ఓవర్‌లోడ్ సమస్య
వేసవిలో ఏసీని నిరంతరం ఉపయోగించడం వల్ల విద్యుత్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. దీని వలన వైరింగ్‌లో షార్ట్ సర్క్యూట్‌లు ఏర్పడతాయి. చాలా మంది ఏసీని గంటల తరబడి ఆన్‌లో ఉంచుతారు.. ఇది కంప్రెసర్‌పై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది AC పేలుడుకు కారణంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఏసీని ఎక్కువసేపు ఆన్‌లో ఉంచకుండా ఉండటం మంచిది.. దీని కోసం AC లో టైమర్ సెట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల రూమ్ చల్లబడిన తర్వాత ఏసీ ఆగిపోతుంది. ఇది పేలుడు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీ విద్యుత్ బిల్లును కూడా ఆదా చేస్తుంది.
పేలవమైన సంరక్షణ
దుమ్ము, ధూళి లేదా ఫిల్టర్ శుభ్రం చేయకపోవడం వల్ల మోటార్ వేడెక్కుతుంది. AC లో దుమ్ము, ధూళి పేరుకుపోవడం వల్ల కూలింగ్ కాయిల్, కంప్రెసర్ పై ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో AC త్వరగా వేడెక్కుతుంది. పేలుడుకు అవకాశాలు పెరుగుతాయి. ఈ ప్రమాదాన్ని నివారించడానికి.. AC శుభ్రతపై శ్రద్ధ పెట్టాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎయిర్ ఫిల్టర్ శుభ్రం చేస్తూ ఉండండి. వేసవిలో AC ఆన్ చేసే ముందు ఒకసారి సర్వీస్ చేయించుకోండి.
స్టెబిలైజర్ లేకపోవడం
చాలా మంది డబ్బు ఆదా చేయాలనే అతి ఆశతో ఏసీ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు స్టెబిలైజర్‌ను ఇన్‌స్టాల్ చేయరు. దీనివల్ల బ్లాస్ట్ అయ్యే అవకాశం పెరుగుతుంది. వేసవిలో వోల్టేజ్ సమస్యలు సర్వసాధారణం. విద్యుత్ హెచ్చుతగ్గులు AC కంప్రెసర్‌పై ఒత్తిడిని కలిగిస్తాయి. అలాగే స్టెబిలైజర్‌ను ఇన్‌స్టాల్ చేయకపోవడం వల్ల ACలో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు పెరుగుతాయి. దీని వలన పేలుడు కూడా సంభవించవచ్చు.
గ్యాస్ లీకేజీ
AC నుంచి రిఫ్రిజెరాంట్ గ్యాస్ లీక్ అవుతుంటే.. దానికి సమీపంలో విద్యుత్ వైర్లు ఉన్నపుడు కూడా పేలుడు జరిగే ఛాన్స్ ఉంది. AC సర్వీసింగ్ చేస్తున్నప్పుడు.. గ్యాస్ లీకేజీ కోసం కూడా చెక్ చేయించండి. గ్యాస్ లీక్ అయినట్లు వాసన వస్తే.. వెంటనే ఏసీ ఆఫ్ చేసి.. టెక్నీషియన్‌ని పిలవండి. ఈ కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా.. AC పేలుడు ప్రమాదాన్ని నివారించడమే కాకుండా.. ఈ విషయాలపై ఫోకస్ పెట్టడం వల్ల AC మెరుగ్గు పని చేస్తుంది.. మీ విద్యుత్ బిల్లును తగ్గిస్తుంది.
Read Also: Success Mantra: జీవితంలో సక్సెస్ కావాలంటే.. ఈ 5 విషయాలు ఇతరులకు చెప్పకండి..
Summer Tips: స్టైలిష్ లుక్ కోసం వేసవిలోనూ బూట్లు ధరిస్తున్నారా.. ఇలా చేస్తే పాదాలు..