Parenting Tips: 10-14 ఏళ్ల వయసున్న పిల్లలు ప్రైవసీ కోరుకుంటే.. ఈ 4 విషయాలు పొరపాటున కూడా చెప్పకండి..
ABN , Publish Date - Apr 11 , 2025 | 04:15 PM
Teen Parenting Tips: ప్రీ టీన్ వయసు నుంచి పిల్లలను హ్యాండిల్ చేయడం తల్లిదండ్రులకు అంత ఈజీ కాదు. ముఖ్యంగా 10 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసుగల పిల్లలు ఒంటరిగా గదిలో ఉండేందుకు ఇష్టపడుతుంటే.. పేరెంట్స్ పొరపాటున కూడా ఈ 4 విషయాలు చెప్పకూడదు.

Teen Privacy Rules: టీనేజ్‌లోకి అడుగు పెట్టే రెండు మూడు సంవత్సరాల ముందు నుంచే పిల్లల ప్రవర్తన, అలవాట్లలో మార్పులు రావడం మొదలవుతుంది. ఈ వయసులో చాలామంది పిల్లలు తల్లిదండ్రులు మాటలను వ్యతిరేకించడం, లెక్కచేయకపోవడం వంటివి చేస్తుంటారు. వారి మనసులో ఉండే ఆలోచనలు అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఈ సమయంలో వారిలో శారీరక మార్పులు కూడా ప్రారంభమవుతాయి. అందుకే ప్రీ టీన్ నుంచి పిల్లలను సరైన దారిలో పెట్టడం పేరెంట్స్ కు పెద్ద సవాల్. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఏదైనా వద్దని చెప్పినా.. కాదని గట్టిగా హెచ్చరించినా.. అది పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య దూరాన్ని పెంచుతుంది. ఒకవేళ 10 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు గదిలో ఒంటరిగా రోజంతా గడపడానికి ఇష్టపడుతున్నట్లయితే.. పేరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో ఈ 4 విషయాల ప్రస్తావన తీసుకురాకండి.
వద్దు అని పదే పదే చెప్తే
అమ్మాయి లేదా అబ్బాయి ఒక గదిలో ఒంటరిగా కూర్చుని ఉంటే వారిని పదే పదే తనిఖీ చేస్తున్నట్లుగా.. నిఘా ఉంచినట్లుగా ప్రవర్తించి తల్లిదండ్రులు వారికి అంతరాయం కలిగించవద్దు. బదులుగా అవకాశం దొరికినప్పుడల్లా వారితో సాధారణంగా మాట్లాడండి. చదువు గురించి లేదా ఏదైనా విషయాల గురించి చర్చించండి. అంతే తప్ప ఇక్కడ కూర్చోకు.. ఇలా చేయవద్దు.. అని మాత్రం చెప్పకండి. వారిలో మంకుతనం, మొండి పట్టుదల మరింత పెరిగి పెద్దలపై కోపం పెంచుకుంటారు.
అనుమానం
పిల్లలు గదిలో ఒంటరిగా కూర్చుని మొబైల్ ఫోన్ చూస్తూ గడుపుతుంటే ఎంతసేపు చూస్తావని గట్టిగా అరవడం.. ఫోన్ లాక్కోవడం లాంటి పనులు తల్లిదండ్రులు అసలు చేయకూడదు. స్క్రీన్ సమయాన్ని గమనిస్తూ ఉండాలి. హఠాత్తుగా ఫోన్ తీసుకున్నట్లుగా కాకుండా ఏదైనా ఒక సాకుతో నెమ్మదిగా బుజ్జగిస్తూ రూం లోంచి బయటికి వచ్చేలా చేయాలి.
గది మూసివేయవద్దు అని చెప్పకండి
ప్రైవసీ కోరుకునే చాలామంది పిల్లలు గదిలోకి వెళ్లగానే ఎవరూ లోపలికి రాకుండా లాక్ చేసుకుంటూ ఉంటారు. దీంతో తల్లిదండ్రులకు ఫోన్ తీసుకుని లోపల ఒంటరిగా కూర్చున్న తమ బిడ్డ ఏం చూస్తున్నాడో.. ఎలాంటి పనులు చేస్తున్నాడో అనే ఆదుర్దా ఉండటం సహజం. ఆ ఆరాటంతోనే గది మూసివేయకుండా లోపల కూర్చో అని రిస్ట్రిక్ట్ చేస్తుంటారు. ఇలా చేస్తే పేరెంట్స్ పట్ల పిల్లల్లో నచ్చినట్టుగా ఉండనివ్వట్లేదనే కోపం పెరిగిపోతుంది. సొంత విషయాలు షేర్ చేసుకునేందుకు ఆసక్తి చూపరు. అందుకే డోర్ గడియ పెట్టుకుని లోపలికి వెళ్తే వెళ్లనివ్వండి. కానీ, తరచూ ఏదో ఒక పని కోసం వారి దగ్గరికి వెళ్తూ కంఫర్ట్ గా ఉండనిస్తూనే ఓ కన్నేసి ఉంచండి.
ఇలా ఎగతాళి చేయకూడదు
మీ పిల్లవాడు అదే గదిలోనే చదువుకుంటూ, నిద్రపోతూ, ఫోన్ వాడుతూ సమయం గడుపుతుంటే 'నువ్వు రోజంతా ఇక్కడే ఎందుకు కూర్చుంటావు' అని ఎగతాళి చేయకండి. బదులుగా చొరవ తీసుకొని అతన్ని/ఆమెను ఏదైనా సృజనాత్మక పనిపై లేదా డాన్స్, సింగింగ్, గేమ్స్ లాంటి వాటిపై ఆసక్తి కలిగేలా ప్రోత్సహించండి. వాటిని నేర్చుకుని పోటీల్లో పాల్గొనమని చెప్పండి.
Read Also: Reduce Belly Fat: జపనీస్ సీక్రెట్.. ఈ వాటర్ తాగితే బాన పొట్ట పరార్..
Best Summer Spots: ఇండియా ది బెస్ట్ సమ్మర్ డెస్టినేషన్స్ ఇవే.. కూల్ కూల్‌గా ఎంజాయ్ చేయండి..
Lip Health: మీ పెదాలు ఈ రంగులోనే ఉన్నాయా.. ఒకవేళ ఈ