Share News

Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..

ABN , Publish Date - Feb 04 , 2025 | 01:25 PM

ఢిల్లీ ఎన్నికల సమయం దగ్గర పడింది. ఈ క్రమంలో ప్రజలు సురక్షితంగా రేపటి (ఫిబ్రవరి 5న) ఎన్నికల్లో పాల్గొని ఓటు వేసేందుకు పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..
Delhi Elections police

రేపు (ఫిబ్రవరి 5న) జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రం గట్టి భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi assembly Elections) ఎలాంటి జోక్యం జరగకుండా, దేశ రాజధానిలో ఎన్నికల భద్రతను ఢిల్లీ పోలీసులు పటిష్టంగా ఏర్పాటు చేశారు. దీంతో ఓటింగ్ రోజు ముందు ప్రజలకు శాంతి సందేశం ఇవ్వడానికి అధికారులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించారు.


ఫ్లాగ్ మార్చ్‌

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మేము రూట్ మార్చ్, ఫ్లాగ్ మార్చ్‌లను పెంచామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) సౌత్ ఈస్ట్, రవి కుమార్ సింగ్ అన్నారు. ప్రజల ప్రవర్తనకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు ఏర్పడకుండా ఉండేందుకు మేము నిఘా పెంచినట్లు తెలిపారు. ప్రజలు శాంతిగా ఉండాలని, ఎన్నికల్లో పాల్గొని, ఓటు హక్కు ఉపయోగించుకోవాలని సందేశం ఇస్తున్నట్లు చెప్పారు పోలీసులు.


వివిధ భద్రతా చర్యలు

ఈ క్రమంలో పారామిలిటరీ దళాలు, పోలీసు సిబ్బంది, సీసీ టీవీ క్యామరాలు, AI ఆధారిత కెమెరాలు, డ్రోన్లతో సహా వివిధ భద్రతా చర్యలను పోలీసులు అమలు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు చోటుచేసుకోకుండా ఉండేందుకు, ఢిల్లీ పోలీసులే కాకుండా ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థలను కూడా వినియోగిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల రోజు ఫిబ్రవరి 5న అల్లర్లను అడ్డుకోవడానికి ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రతా చర్యలు మరింత పెంచుతున్నారు.


ధన రవాణా, మద్యం స్వాధీనం

దీంతోపాటు ఎన్నికల రోజు సురక్షిత వాతావరణం ఉండేందుకు నగరంలోని కీలక ప్రాంతాల్లో ముఖ గుర్తింపు సాంకేతికత (Facial Recognition System)ను ఉపయోగిస్తున్నారు. అదనంగా AI-ఆధారిత కెమెరాలు, డ్రోన్లు, 30,000 మంది పోలీసు సిబ్బంది, 6,525 మంది శిక్షణ లేని సిబ్బందిని కూడా నియమించారు.

నవంబర్ 7 నుంచి ఫిబ్రవరి 2 వరకు అధికారులు ఇప్పటివరకు రూ.11,23,97,697 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో 1,08,258 లీటర్ల మద్యాన్ని రూ.3,59,65,843 విలువతో స్వాధీనం చేసుకున్నారు. వీటి విషయంలో 1315 FIRలు నమోదు చేయబడ్డాయి. 1353 మందిని అరెస్టు చేశారు.


ఎన్నికల రోజు భద్రతా ఏర్పాట్లు

ఫిబ్రవరి 5న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 35,626 మంది ఢిల్లీ పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారు. వీరితో పాటు 6,525 మంది శిక్షణ లేని సిబ్బందీ సహకరించనున్నారు. ఎన్నికలు పూర్తయ్యాక, ఫిబ్రవరి 8న ఫలితాలు ప్రకటించబడతాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈ చర్యలు మరింత పెంచారు. 2020 అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికల సమయంలో నిర్దేశించిన ప్రమాణాలను మేము అధిగమించగలిగామని పోలీసులు తెలిపారు.


ఇవి కూడా చదవండి:

Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 04 , 2025 | 01:32 PM