Medicine Price Hike in India: 900 ఔషధాల ధరల పెంపు
ABN , Publish Date - Apr 02 , 2025 | 04:42 AM
సెంట్రల్ మంత్రిత్వశాఖ 900 ఔషధాల ధరలను పెంచేందుకు ఎన్‌పీపీఏ అనుమతి ఇచ్చింది. ఈ పెంపు, గుండె జబ్బులు, మధుమేహం, ఇన్‌ఫెక్షన్లకు ఉపయోగించే ఔషధాలను ప్రభావితం చేస్తుంది

ఫార్మా కంపెనీలకు ఎన్‌పీపీఏ అనుమతి
జాబితాలో గుండె జబ్బులు, మధుమేహం,
ఇన్‌ఫెక్షన్లకు చికిత్సను అందించే మందులు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ పరిధిలోని ‘జాతీయ ఔషధ ధరల సాధికారసంస్థ’ (ఎన్‌పీపీఏ) 900కిపైగా ఔషధాల ధరల పెంపునకు అనుమతించింది. మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయంతో.. గుండె జబ్బులు, మధుమేహంతోపాటు పలు కీలక ఇన్‌ఫెక్షన్లకు చికిత్సను అందించే ఔషధాల ధరలు గరిష్ఠంగా 1.74ు మేర పెరగనున్నాయి. ఈ వివరాల్ని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయమంత్రి అనుప్రియా పటేల్ లోక్‌సభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు. ధరలు పెరగనున్న ఔషధాల జాబితాలో అజిత్రోమైసిన్, అమోక్సిసిలిన్, డైక్లోఫెనాక్, ఇబుప్రొఫెన్, డాపాగ్లిఫ్లోజిన్, మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్, గ్లిమ్‌పైరైడ్, అసిక్లోవిర్, హైడ్రాక్సీ క్లోర్లోక్విన్ మొదలైనవి ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
Ranveer Allahbadia: రెండు వారాల తర్వాతే.. అల్హాబాదియా పాస్‌పోర్ట్ రిలీజ్‌పై సుప్రీంకోర్టు
Pryagraj Demolitions: ప్రయాగ్‌రాజ్ బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీం ఆగ్రహం.. నష్టపరిహారానికి ఆదేశం
ఘోర ప్రమాదం.. మంటల్లో కాలి 12 మంది మృతి
మొగలుల పాలనా అంశాల్ని పాఠ్య పుస్తకాల నుంచి ఎందుకు తొలగించారు : సోనియా గాంధీ
For National News And Telugu News