Akhilesh Yadav: మనుషులా? మరబొమ్మలా?.. వారానికి 90 గంటల పనిపై అఖిలేష్
ABN , Publish Date - Mar 03 , 2025 | 09:42 PM
వారానికి 90 గంటల పనిపై టెక్ ఇండస్ట్రీతో పాటు సినీ పరిశ్రమలోనూ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. తాజాగా రాజకీయరంగం నుంచి తొలి స్పందన వచ్చింది. దీనిపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ బహిరంగంగా తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు.

లక్నో: ఉద్యోగుల వారానికి 90 గంటలు పనిచేయాలంటూ దిగ్గజ పారిశ్రామిక వేత్తలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటం, దీనిపై తరచు చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) స్పందించారు. "వారానికి 90 గంటలు పనిచేయాలని మీరు చెబుతున్నది మనుషుల గురించా? రోబోల గురించా?'' అని ప్రశ్నించారు.
Aurangzeb Row: ఔరంగజేబ్ గొప్ప పాలకుడు.. ఎస్పీ నేత వ్యాఖ్యలపై దుమారం
వారానికి 90 గంటల పనిపై టెక్ ఇండస్ట్రీతో పాటు సినీ పరిశ్రమలోనూ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. తాజాగా రాజకీయరంగం నుంచి తొలి స్పందన వచ్చింది. దీనిపై అఖిలేష్ బహిరంగంగా తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు. "90 గంటల పని అంటూ మీరు చెబుతున్నది మనుషుల గురించా? రోబోల గురించా? ఎందుకంటే మనుషులైతే భావోద్వేగాలతోనూ, కుంటుంబంతో కలిసి జీవించాలని అనుకుంటారు. ఆర్థిక పురోగతి వల్ల కలిగే ప్రయోజనం కొద్దిమందికి వ్యక్తులకే ఎందుకు దక్కుతోందని సామాన్య ప్రజానీకం ప్రశ్నిస్తోంది. ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్లు, 100 ట్రిలియన్లకు చేరడం వల్ల సామాన్యుల జీవితాల్లో వచ్చే తేడా ఏముంటుంది? ఆర్థిక ప్రయోజనాలు అందరికీ అందడమే నిజమైన ఆర్థిక న్యాయం. ఈ బీజేపీ ప్రభుత్వంలో అది సాధ్యం కాదు'' అని సుదీర్ఘ పోస్ట్‌లో అఖిలేష్ అన్నారు.
బీజేపీ 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ టార్గెట్‌పై అఖిలేష్ మాట్లాడుతూ, పని-లైఫ్ మధ్య సమత్యుల్యం ఉంటేనే మానసికంగా ఆరోగ్యవంతమైన వాతావరణం ఉంటుందని అన్నారు. ''యువతలోని క్రియేటివిటీ, ఉత్పాదకత కచ్చితంగా దేశాన్ని, ప్రపంచాన్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. అయితే బీజేపీ అవినీతి సగానికి సగం తగ్గినా ఎకానమీ అనేది దానంతటదే రెట్టింపు అవుతుంది. పడవలో చిల్లు ఉంచుకుని ఇతరులకు సలహా ఇవ్వడంలో అర్థం లేదు" అని బీజేపీపై విమర్శలు గుప్పించారు.
ఎవరేమన్నారు?
భారత్‌లోని యవత వారానికి 70 గంటలు చొప్పున పనిచేయాలని కొంతకాలంగా 'ఇన్ఫోసిస్' నారాయణమూర్తి చెబుతున్నారు. దీనిపై చర్చ సైతం సాగుతోంది. 90 గంటలు పనిచేయాలని ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ సూచించగా, 80 నుంచి 90 గంటలు పనిచేయాలని నీతిఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ సూచించారు.
ఇవి కూడా చదవండి
MK Stalin: కొత్త దంపతులు వెంటనే పిల్లల్ని కనండి
Mamata Banerjee: డూప్లికేట్ ఎపిక్ నంబర్లు ఉంటే.. నకిలీ ఓటర్లు ఉన్నట్లు కాదు!
Raksha Khadse: కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే కుమార్తెకు పోకిరీల వేధింపులు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.