Share News

Ayodhya: అయోధ్య రామాలయ ట్రస్టుకు బెదిరింపు మెయిల్

ABN , Publish Date - Apr 14 , 2025 | 03:36 PM

అయోధ్య రామాలయం భద్రతకు సంబంధించి బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం రాత్రి ఈ బెదరింపు మెయిల్ వచ్చినట్టు గుర్తించారు.

Ayodhya: అయోధ్య రామాలయ ట్రస్టుకు బెదిరింపు మెయిల్

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య (Ayodhya) రామాలయ ట్రస్టుకు ఈమెయిల్ బెదిరింపు వచ్చింది. రామాలయం భద్రతకు సంబంధించి బెదిరింపులు వచ్చినట్టు పోలీసు సీనియర్ అధికారి ఒకరు సోమవారంనాడు తెలిపారు. దీనిపై పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఆదివారం రాత్రి ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. దీనికి సంబంధించి ఎక్కువ వివరాలను పోలీసులు వెల్లడించనప్పటికీ, తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి ఆంగ్లలో మెయిల్ చేసినట్టు వారు గుర్తించారు.

PM Modi: వక్ఫ్ నిబంధనలను స్వార్థం కోసం కాంగ్రెస్ మార్చేసింది: మోదీ


కాగా, బెదిరింపు ఈమెయిల్‌పై రామాలయం ట్రస్టు కానీ, భద్రతా అధికారులు కానీ ఇంతవరకూ ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు. అయోధ్య రామాలయాన్ని 2024లో 13.5 కోట్ల మంది దర్శించారు. తాజ్ మహల్‌ సందర్శకులను దాటి ఈ రికార్డును ఆయోధ్య రామాలయం సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

India Laser Weapon: భారత్‌ అమ్ముల పొదిలో లేజర్‌ అస్త్రం

Supreme Court Review Petition Filed: గడువు వద్దు

Updated Date - Apr 14 , 2025 | 04:47 PM